పూజ.. మనశ్సాంతి కోసం.. భగవదనుగ్రహం కోసం మనిషి చేసే క్రతువు.. ఐతే.. ఈ పూజలలోనూ అన్ని రకాలు వస్తువులు, పూవులు వాడరు. వాటికి కొన్ని నియమాలు, నిషిద్దాలు ఉంటాయి. ప్రత్యేకించి కొన్ని పూవులు పూజకు పనికిరావంటారు. అలాంటి వాటిలో మొగలి పూవు ఒకటి.
మరి మొగలి పూవు ఎందుకు పూజకు పనికిరాదో తెలుసా.. పురాణాల ప్రకారం.. ఒకసారి బ్రహ్మ, విష్ణువులు నేను గొప్పంటే నేను గొప్పని కలహించుకుంటున్నారట. అపుడు వారి మధ్య ఒక శివలింగం పుట్టిందట. ఆ లింగం బ్రహ్మతో నా శిరస్సు ఎక్కడుందో కనుక్కోవాలని.... విష్ణువును తన పాదాలేక్కడున్నాయో కనుక్కోవాలని కోరాడట.
దాని ప్రకారం హంసరూపంలో బ్రహ్మ పైకి... ఆదివరాహరూపంలో విష్ణువు క్రిందికి.. వెళ్లారు. బ్రహ్మకు లింగంశిరస్సు, విష్ణువునకు లింగపాదాలు కన్పించలేదు. విష్ణువు అంతా తిరిగి వచ్చి లింగంపాదాలు కనిపించాలేదని చెప్పాడట. బ్రహ్మ మాత్రం తాను.. లింగం శిరస్సు చూచానని.. అందుకు మొగిలిపూవు, కామధేనువులతో సాక్ష్యం చెప్పించాడు.
కామధేనువు తోక మాత్రం అడ్డంగా ఊపి ఇది అబద్ధమని తెలియజేసింది. అప్పుడు విష్ణువు మొగలిపూవు అబద్ధం చెప్పింది కనుక అది పూజకర్హం కాదనీ, కామధేనువు వృష్ఠభాగంతో సత్యం తెలిపింది కనుక ఆవుకు వెనుకభాగం పూజార్హమగుగాక అనీ శాపం పెట్టాడు. అందువల్ల మొగలి పూవు పూజకర్హం కాకుండా పోయింది.