దసరా మహోత్సవములు – 2016

తెలుగు వారు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగల్లో విజయదశమి (దసర) పండుగ ఒకటి. అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు.

శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు.

జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి. 


🙏  శ్రీ అమ్మవారి దివ్య అలంకరములు  🙏


🍁ది:1-10-2016 – శనివారము-ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి-శ్రీ స్వర్ణకవచ దుర్గాదుర్గాదేవి


🍁ది:2-10-2016-ఆదివారము-ఆశ్వయుజ శుద్ధ విదియ-శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి


🍁ది:3-10-2016-సోమవారము-ఆశ్వయుజ శుద్ధ విదియ (వృద్ది)-శ్రీ గాయత్రి దేవి

🍁ది:4-10-2016-మంగళవారము-ఆశ్వయుజ శుద్ధ తదియ-శ్రీ అన్నపూర్ణా దేవి


🍁ది:5-10-2016-బుధవారము-ఆశ్వయుజ శుద్ధ చవితి-శ్రీ కాత్యాయని దేవి


🍁ది:6-10-2016-గురువారము-ఆశ్వయుజ శుద్ధ పంచమి-శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి 


🍁ది:7-10-2016-శుక్రవారము-ఆశ్వయుజ శుద్ధ షష్ఠి-శ్రీ మహాలక్ష్మిదేవి


🍁ది:8-10-2016-శనివారము-ఆశ్వయుజ శుద్ధ సప్తమి-శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం)


🍁ది:9-10-2016-ఆదివారము-ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) -శ్రీ దుర్గా దేవి

🍁ది:10-10-2016-సోమవారము- ఆశ్వయుజ శుద్ధ నవమి( మహర్నవమి)-శ్రీ మహిషాసురమర్ధినీ దేవి


🍁ది:11-10-2016-మంగళవారము-ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి)-శ్రీ రాజరాజేశ్వరి దేవి


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: