జై గో మాత!

Vamsi
గోమాతతో సంభంధం ఉన్న పండగల్లో ఒకటి మహా శివరాత్రి, శివరాత్రి పర్వదినం రోజు శివుణ్ణి నందిని పూజిస్తారు నంది గోవు సంతతి.

శివరాత్రి పరమ శివుని పూజ, అభిషేకంలో:
1)గంగా జలం వాడుతారు గంగ హిమాలయాల్లోని గోముఖం నుండి (ఉద్భవించింది) 
2)అభిషేకంలో వాడే పూజా ద్రవ్యాల్లో ఆవుపాలు, పెరుగు, నెయ్యి, వీటిని గోవు మనకు ప్రసాదిస్తుంది
3)శివుడికి ప్రీతి పాత్రమైన భస్మాలంకరణలో గోమయంతో చేసిన భస్మం, ఉపయోగిస్తారు 
4)శివునికి బిల్వ పత్రం సమర్పిస్తారు ( బిల్వ వృక్షం ఆవుపేడలో నుండి ఉద్భవించింది)
5)ధూపం శాస్త్ర యుక్త ధూపం గోవు పెడతో చేయబడ్డ పీడకను వెలిగించి ధూపం పడతారు.
6)దీపం శాస్త్ర యుక్త దీపం ఆవు నెయ్యితో వెలిగిస్తారు
7)మంగళ హారతి ఆవునేతిలో నాంచిన వత్తులతో శివునికి మంగలహారతి ఇస్తారు     
8)శివునికి ప్రీతి పాత్రమైన నైవేద్యం ఆవు పాలు నెయ్యితో చేస్తారు పూజా ద్రవ్యాలకు గోమాతకు శాస్త్ర యుక్త సంభంధం ఉంటుంది ఇవ్వే కాక శివరాత్రి ఉపవాసం ఉండే వారు చాలా మంది కేవలం ఆవుపాలు సేవించి గోమయ భస్మం ధరించి భక్తితో శివరాత్రి జరుపుకోవడం జరుగుతుంది

గోమాతకు మహా శివరాత్రికి అవినాభావ సంభంధం వుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: