రంజాన్ : ఫిత్రా అంటే ఏమిటి?

ఒక సాధారణ మనిషి ఎల్లప్పుడూ ప్రాపంచిక విధులతో కట్టివేయబడుతున్నాడు మరియు దేవుని కోసం సమయం వెచ్చించటానికి కూడా కష్టపడుతున్నాడు. ఉపవాసం అనేది ఒక తపస్సు వంటిది ఎందుకంటే ఒక వ్యక్తి ఆహారాన్ని త్యజించి, దేవునిపై పూర్తిగా దృష్టి పెట్టటం. రోజులో పగటిసమయంలో ఆహారం త్యజించి ఉపవాసం ఉన్న వ్యక్తి, ఆరోజు ప్రాపంచికంగా ఆ వ్యక్తీ మరణించినట్లుగా భావిస్తారు మరియు దేవుని ప్రార్ధిస్తూ పూర్తిగా లీనమవుతారు.  రాత్రి భోజనము తీసుకున్న వ్యక్తి, తన జీవనోపాధి కోసం తిన్నట్లుగా భావిస్తారు; బాహ్య ప్రపంచం నుండి తననుతాను మూసివేసుకోవడం 
మరియు అంతర్గత ఆధ్యాత్మిక ప్రపంచానికి దగ్గరవటం.

పవిత్ర ఖురాన్ పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని ప్రవక్త మహమ్మద్ రంజాన్ నెలలో వెల్లడి చేశారు. దేవుడు తన దూతగ మహమ్మద్ ప్రవక్తను ఎంచుకున్నాడు  మరియు ఖురాన్ వంటి పవిత్ర గ్రంథాన్ని రచింపచేశాడు. రంజాన్ చివరి 10 రోజులు ప్రశస్తమైనవిగా భావిస్తారు ఎందుకంటె ప్రవక్త గ్రంథం పూర్తయిన సమయం లైలతుల్ ఖదర్ (పవర్ రాత్రి) అని నమ్ముతారు. మహమ్మద్ ప్రవక్త జ్ఞానోదయం మహమ్మద్ ప్రవక్త ఒక సెయింట్ గ జన్మించాడు. కానీ అతను పెరిగిన సమయంలో హింసలు ఎక్కువగా ఉండేవి. అతను, ప్రజలు జీవిస్తున్న విధానాలపట్ల మనస్తాపం చెందాడు.  ఫిత్రా దానానికి రంజాన్ నెలలో ఎం తో ప్రాముఖ్యత వుంది.

మూడుపూటల ఆహారం, ఒంటనిండా బట్ట లేని పేదవారు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి అభాగ్యులకు, పేదవారికి పండుగ సందర్భంలో దానం చేయాలని ఖురాన్ ఉద్భోధిస్తుంది. దీనినే 'ఫిత్రాదానం' అని పిలుస్తారు.  ఉపవాసవ్రతాలు విజయవంతంగా ముగిసినందుకు గానూ దేవుడికి కృతజ్ఞత చెప్తూ.. పేదలకు ఈ ఫిత్రాదానం విధిగా అందజేస్తారు. ఈ ఫిత్రాదానంలో 50 గ్రాముల తక్కువ రెండు కిలోల గోధుమలను గానీ, దానికి సమానమైన ఇతర ఆహార ధాన్యాలను గానీ, ధనాన్ని గాని పంచిపెట్టాలి.

ఈ దానం కుటుంబంలోని సభ్యులందరి తరపున పేదలకు అందజేయాలి. దీనివలన సర్వపాపాలు హరించబడి, పుణ్యం దక్కుతుందనే నమ్మకం ఉంది.  దైవ ప్రవక్త ఫిత్రాధానాన్ని విధిగా నిర్ణయించడానికి కారణం ఉపవాస వ్రత నియమాన్ని పాటించే సమయంలో హృదయంలో కలిగే చెడు తలంపులు, ఆలోచనలు, నోటినుంచి వెలువడే అసత్యాలు, పనికిమాలిన మాటలు ఫిత్రాదానం వల్ల క్షమించబడతాయనిని మహామ్మద్‌ అనుచరుడు అబ్దుల్లా బిన్‌ మసూద్‌ తెలిపాడు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: