నేడు నృసింహజయంతి: మానవదేహంతో శ్రీ హేమాచల లక్ష్మినృసింహస్వామి: తీర్ధక్షేత్రం

భారతజాతి సంస్కృతి మొత్తం సనాతనధర్మం ఆధారంగా రూపుదిద్దుకుంది. అనేక ఏర్లు, సెలయేళ్ళు, చిన్నచిన్ననదులు, రకరకాల ప్రవాహాలు జాలువారి ప్రవహించి గంగ, గోదారి, కృష్ణానదుల సాగరతీరానికి చేరి అందులో సంగమించి మాయమౌతాయి. అందుకే సాగరమంతైంది భారత సనాతన సంస్కృతి సదాచారం సాంప్రదాయం అంతాకలసి. అందుకే ఇక్కడ ఎక్కడ చూసినా పల్లెకో సంస్కృతి పురానికో సాంప్రదాయం. ఏ సాంప్రదాయాన్ని తరచిచూసినా, ఏ సదాచారాన్ని సృజించినా, ఎన్నో సాంస్కృతిక పునాదులు చరిత్ర పునాదులే - బయల్పడతాయి.


శ్రీమహవిష్ణువే మానవదేహంతో వెలసిన తీర్ధ క్షేత్రం “శ్రీ హేమాచల లక్ష్మినృసింహస్వామి”అంతేకాదు ఇక్కడ ఎన్నో క్షేత్రాలు, ఇంకెన్నో తీర్థాలు ఉంటాయి అలాగే తీర్ధ క్షేత్రాలు కూడా. అందుకే భారత సాంప్రదాయం అనేక సంస్కృతుల సదాచారాల అలవాట్ల సంగమం తీర్ధ క్షేత్రాల్లా.శ్రీమహవిష్ణువే మానవదేహంతో వెలసిన తీర్ధ క్షేత్రం “శ్రీ హేమాచల లక్ష్మినృసింహస్వామి”ఈ తీర్ధక్షెత్ర పౌరాణిక మూలాలు రామాయణకాలం నాటివి. శ్రీలంకేశ్వరుడు రావణాసురుని ప్రియ సహోదరి శూర్పణకకు అరణంగా అంటే పసుపు కుంకుమలుగా సమర్పించినదే ఈ శ్రీ హేమాచల దండకారణ్యం.


ఈ ప్రాంతంలో ఉన్న అనేక గుహలను "రాక్షస గుళ్ళు" అనటం వాటిలో రాక్షసమూక నివసించిన సందర్బంగా ప్రచారమై ఉండవచ్చు శూర్పణక చేసే అరాచకాల నుండి నాటి ఋషులు, తాపసులు, అమాయక జనులను సంరక్షించటానికి - పదునాలుగువేల రాక్షసమూక వాటికి నాయకత్వం వహిస్తున్న ఖర దూషణాదులనే అత్యంత ప్రమాధకర రాక్షస సమూహాన్ని  శూర్పణక సహితంగా సమూలంగా సంహరిచి ధర్మసంస్థాపన చేశారు శ్రీరామచంద్రులవారు. శ్రీమహవిష్ణువే మానవ దేహంతో వెలసిన తీర్ధ  క్షేత్రం “శ్రీ హేమాచల లక్ష్మినృసింహస్వామి”


ఆ మహామహితాత్ముడైన శ్రీరాముడు ధర్మసంస్థాపన చేసిన పవిత్ర ప్రాంతమే నేటి జయశంకర్-భూపలపల్లి జిల్లాలోని మంగపేట మండలానికి చెందిన మల్లూరు గ్రామీణ ప్రాంతం. ఈ ప్రాంతం లోనే పద్మభవ మహర్షి తపస్సుచేసి, తపఃఫలితంగా ఆయన కోరిక అనుసరించి ఆ శ్రీ మహా విష్ణువు "శ్రీ హేమాచల లక్ష్మినృసింహ స్వామి" గా వెలసి మరోసారి ధర్మ సంస్థాపన చేసిన వేదకాలం నాటి పౌరాణిక చరిత్ర అది.


ఇక చారిత్రాత్మక మూలాలు పరిశీలిస్తే వాటి తల్లివేరు శాతవాహనశకం ద్వితీయ శతాబ్ధంనాటిది. శాతవాహన రాజవంశజుడు దిలీపకర్ణి ప్రభువుకు ఆ శ్రీమహావిష్ణువు స్వప్నసాక్షాత్కారం చేసి తను ఒక గృహాంతర్భాగం లో సెలవై ఉన్నానని తెలియ జేశారు. ఆయితే స్వప్న సాక్షాత్కారం ద్వారా స్వామి వారికి తన ఉనికి తెలియ జేసిన స్వామిని బహిరంగపరచటానికి ఆ పర్వతగుహ అంతర్భాగాన్ని తొలిపించి తన డెబ్బై ఆరువేళ సైన్యాన్ని వినియోగించారట. ఆ సందర్భంగా గునపం తగిలి గాయమైన స్వామివారి నాభి భాగం నుండి రక్తం స్రవించిందట. ఆ ప్రాంతాన్ని తమ కరస్పర్శ చేత సృజించి స్వామిని పసివానిలా సాకి స్వాంతన పరిచారట అప్పటి తాపసులు.


అయితే నాడు నాభిగాయం నుండి స్రవించిన ద్రవమే నేటి కలియుగకాలంలో 'నాభి చందనం' గా ఆయన భక్తజనులకు అందిస్తూ వస్తున్నారు. ఆ చందనం స్వీకరించి న జనావళి జన్మచరితార్ధమై మంగళకరమౌతుందని విశ్వాసం. అది సహస్రాబ్ధాల నమ్మకం. వారికి సంతాన భాగ్యం, ఆరోగ్యభాగ్యం కలుగుతుందని విశ్వాసం. వైవాహిక విభేదాలు ఉన్న నాభి చందన ధారకులకు సమస్యలు సునాయాసంగా తొలగిపోయి, వారి జీవితం సుమంగళకరమౌతున్న దాఖలాలు కోకొల్లలు


ఇక ఆ మహావిష్ణు సతీమణులు శ్రీదేవి భూదెవి ఇరువురు ఆదిలక్ష్మి చెంచులక్ష్మి పేర్లతో సజీవ జలధారలై ఈ క్షేత్ర సానువుల్లో ప్రవహిస్తూ చింతామణి పేరుతో ప్రసిద్ధమయ్యాయి. ఈజలపాతాల్లో స్నానం చేసిన లేదా సజలాన్ని స్వీకరించినా సుదీర్ఘ చర్మ దేహ మానసిక వ్యాధులు మటుమాయం ఔతాయన్నది యాదర్ధమని ఋజువైన చరిత్రలు. ఇప్పుడూ ఆ అనుభూతిని ఆస్వాధించిన ప్రతిఒక్కరూ చెప్పే నిజాలు. ఆ అనుభావాన్ని ఆస్వాదించిన కాకతీయ సామ్రాఙ్జి రాణి రుద్రమదేవి స్వయాన "చింతామణి" అని జలధారలకు నామకరణం చేసినది చరిత్ర ప్రఖ్యాతం. చింతామణి అంటే నిఘంటు అర్ధం "అదృష్టం ప్రసాధించే రత్నం-అదృష్ట ప్రదాయిని' అనవచ్చు.  ఈ జలం స్వీకరించిన వారికి అద్భుతప్రయోజనం సిద్ధిస్తుందని నమ్మకం విశ్వాసం.


ఈ క్షెత్రం అష్టాదశ భుజశక్తి అనే 'గుట్టదైత' క్షెత్రశక్తిగా కాపాడుతుంది. ఆపైన ఈ క్షెత్ర పాలకుడుగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారు నిరంతరం ఈ హేమాచలానికి, ఆ క్షెత్ర దైవమైన శ్రీ లక్ష్మి నృసింహ స్వామి భక్తులకు నిరంతరం రక్షణ నిస్తూ వస్తున్నారు. ఇంకా ఈ క్షేత్ర ఎనిమిది  దిక్కుల్లో గరుడాంజనేయ స్వామివారు సర్వదా అదృశ్యరూపంలో నిరంతరం పరిభ్రమి స్తూ సఖల జనావళికి సురక్ష ప్రసాదిస్తూ ఉంటారట.  ఈ ఉగ్రనారసింహుని ఉగ్రత్వానికి చుట్టుపట్ల ఉన్న అరణ్యాలు భస్మీ పటలం అవుతున్న పరిస్థితుల్లో ఆయన భక్తులైన ఋషుల కోరికతో ఆయనను శాంత పరచటానికే ఆయన సపత్నులిరువుర్ని  ఆదిలక్ష్మి-చెంచులక్ష్మిగా మూలవిరాట్టుకు ఇరు ప్రక్కల ఆలయంలో ప్రతిష్టించారు. ఆ తరవాత అరణ్యాలు దహనమైన సందర్భాలు లేవట.  దక్షిణాదిన నవ నారసింహ క్షెత్రము లలో ఇది ప్రధాన క్షెత్రంగా భాసిల్లబడుతుంది.


ఈ దేవాలయ ప్రాంగణానికి పశ్చిమ ముఖంగా శ్రీ వేణుగోపాల క్షేత్రం ఉంది. తూరుపు భాగాన కోనేరు ఉంది. ఈ క్షేత్ర దర్శన మాత్రాన్నే సకలదోష నివారణ- చింతామణి జలసేవనంతో దీర్ఘకాల వ్యాదుల నివారణ వలన క్షెత్రంలో భక్తుల తాకిడి ఎక్కువే. దెవాలయంలో నవగ్రహాలు ప్రతిస్థాపించ బడ్దాయి. కళ్యాణ మండపం నిర్మించారు.  2003 గోదావరి పుష్కరాల సంధర్భంగా ప్రభుత్వం కేటాయించిన మూడు లక్షల రూపాయిలతో గర్భాలయాన్ని నిర్మించారు.

దేవాదాయ ధర్మాదాయశాఖ పరిధిలోకి చేరిన దేవాలయ నిర్వహణను పునఃసమీక్షించవలసిన అవసరం ఉంది. ఈ దేవాలయంలో మానవ శరీరతత్వము ఉండటంతో శ్రీస్వామికి-శనిదేవునికి మల్లే శని, ఆది, సోమ వారాల్లో తైలాభిషేకం చేయటం ఆచారం. దీంతో ఈ స్వామి శని, రాహు, కేతువుల ప్రభావాన్ని ప్రయోజనం గా మార్చగలరట. హైందవ పురాణాల్లో శ్రీ మహావిష్ణు అవతారానికి తైలాభిషేకం చేయటం ఇక్కడే చూస్తాం.


ఈ దేవాలయం ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు తెరచి ఉంచుతారు. అరణ్యంలో ఉండటం వలన సాయంత్రం త్వరగా దేవాలయాన్ని మూసి ఉంచుతారు. హైదరాబాద్ నుండి 290 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తీర్ధక్షెత్రం చేరటానికి అన్నిరకాల ప్రయాణ సదుపాయాలున్నాయి. వరంగల్ నుండి ఈ క్షెత్రప్రయాణ మార్గంలో రామప్ప, లక్నవరం వంటి కాకతీయులు నిర్మించిన పెద్ద చారిత్రాత్మక తటాకాలు (చెరువులు) ఉన్నాయి. మేడారం జాతర ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ఆదివాసీల జాతర ఈ ప్రాంతంలోనే జరుగుతుంది. ఇప్పుడు ఆదివాసీలనే కాకుండా అందరినీ ఆకర్షిస్తూవస్తుందీ జాతర. మల్లూరు శ్రీ లక్ష్మినృసింహ క్షేత్రం నుండి 110 కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ధ భద్రాచల పుణ్యక్షెత్రం నెలకొని ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: