విజయదశమి రోజున ఇలా చేస్తే వద్దన్న డబ్బు మీ వద్దకు వస్తుంది !

మనిషి నిత్యం చేసే పూజల వల్ల తనలో వున్న చెడు నశింపబడుతుందని మనం ఇదివరకే ఎన్నో సార్లు వినే వున్నాం.కాని ఈ పూజలు నిష్ఠతో,చేయడమే కాకుండా ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ప్రతి ప్రాణి భగవంతుని స్వరూపమనే భావనతో చేస్తే చాల మంచిది. ఇక ఈ రోజు ఇంట్లో డబ్బులు నిల్వకోసం ఇలా చేస్తే విశేష ఫలితం వస్తుందని మన పురాణాల్లో ఉంది. ఇకపోతే విజయదశమి ఆశ్వయుజమాసం శుక్లపక్షంలో వచ్చే దశమి తిథి రోజున, సాయంకాలం నక్షత్రాలు ఉదయించే వేళ విజయ కాలంగా చెబుతారు.


ఈ కాలానికి సమస్తమైన కోరికలను తీర్చే  కాలంగా పేరు ఉంది. సాధారణంగా విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది అందుకే ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకొనేవారు ఈ రోజు ప్రారంభిస్తే విశేషంగా లాభిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి.. ఇకపోతే జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీ ప్రదమని పురాణాలు చెబుతున్నాయి.


ఈ శమీవృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో కూడా ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో గాని, ధన స్థానంలో గాని ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుంది. ఇక పరమ శివునికి, జగన్మాత దుర్గా దేవికి, సిద్ది ప్రదాత వినాయకునికి శమీ పత్రి సమర్పించే ఆచారం అనాదిగా వస్తోంది. పూర్వం జమ్మి చెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే యజ్ఞ యాగాదుల క్రతువులు నిర్వహించేవారు.


ఇవాల్టికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో శమీవృక్షంలో అగ్ని ఉంటుందనే విశ్వాసం దృడపడింది. అగ్ని వీర్యమే సువర్ణం అంటారు. అందుకే జమ్మి బంగారం కురిపించే కల్పవృక్షంగా పూజలందుకుంటోంది.శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపజేసేదని భావిస్తారు. మరో విశేషం ఏంటంటే ఈ రోజే శ్రీ రాముడు రావణునిపై విజయం సాధించిన రోజు.అంతే కాక శ్రీ రాముని వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చేక్కతోనే నిర్మించారని చెబుతారు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: