మన తెలుగు రాష్ట్రము మైన తెలంగాణలో దసరా పండుగను బతుకమ్మ పండుగగా జరుపుకుంటారు. ఇక దసరా వచ్చిదంటే అందరి ఇళ్లలోను ఆడబిడ్డల సందడే. ఎన్ని పనులు ఉన్నా మాత్రం బతుకమ్మ పండగకు పుట్టింటికి వస్తారు అందరి ఆడబిడ్డలు. బతుకమ్మ అంటే.. బతుకు అమ్మా అని అర్థం. పండగ రోజు రకరకాల పువ్వుల్ని వరసలుగా పేర్చి సాయంత్రం వీధుల్లోకొస్తారు. బతుకునివ్వు బతుకమ్మా అంటూ బతుకమ్మ చూట్టూ తిరుగుతూ అట పాటలతో జరుపుకుంటారు.
దసరా రోజు సాయంత్రం సమయాల్లో పాలపిట్టను చూస్తే శుభం కలుగుతుందని తెలంగాణ ప్రజల నమ్మకం. అమ్మవారి పూజ తర్వాత పాలపిట్ట దర్శనం చేసుకుంటారు. అంతేకాదు దసరా రోజున అలయ్-బలయ్ అంటారు.
ఇక మన దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల వారు విజయదశమి రోజున బొమ్మల కొలువు పెడతారు. పేరంటాళ్లను పిలిచి పురాణాలు చదువుకుంటారు. బొమ్మల కొలువుల్లో పురాణ కథల్లో ఉండే పాత్రల బొమ్మలను పెడతారు కొలువులో. అందులో ముఖ్యంగా మాతా గౌరీదేవీ కచ్చితంగా ఉంటుంది. మహిళలతో పాటు యువతులు కూడా చేరి అమ్మవారి పాటలు పాడుకుంటారు. పసుపు, కుంకుమలతో వాయనాలు ఇస్తారు.
ఇక దసరాను కర్ణాటకవాసులు ప్రత్యేకంగా జరుపుకుంటారు. అమ్మవారి నవరాత్రులు ప్రారంభం అయ్యే రోజున ఘనంగా ప్రతిష్ట చేస్తారు. కొత్త మట్టి మూకుడులో మట్టిపోస్తారు. దుర్గాదేవి ప్రతిమను ప్రతిష్టిస్తారు. ఆ మట్టిలో నవధాన్యాలను (గోధుమ, యవలు, పెసలు, శనగలు, కందులు, అలసందలు, నువ్వులు, మినుములు, ఉలవలు) ఉంచుతారు. తొమ్మిది రోజులు అమ్మవారిని పూజిస్తారు. ప్రతీ రోజు ఆ మూకుడులో నీళ్లు పోస్తారు. అలా ఆ విత్తనాలు మొలకలు వస్తాయి. 10వ రోజు దర్గాదేవి పూజ చేసి ఆ ఘటాన్ని(మూకుడు) అమ్మగుడిలో పెట్టి ఇంటికి తిరిగి వస్తారు.