చీప్ గా వస్తున్నాయని చైనా క్రాకర్స్ కొంటున్నారా? చచ్చారే....!

frame చీప్ గా వస్తున్నాయని చైనా క్రాకర్స్ కొంటున్నారా? చచ్చారే....!

చైనా క్రాకర్స్‌ కాల్చరాదని.... దేశానికీ, దేహానికి మంచిది కాదని చెబుతున్న కానీ కొందరు చెవికెక్కించుకోవట్లేదు. ఇందులో వాడే రెడ్‌లెడ్‌, కాపర్‌ ఆక్సైడ్‌లాంటి కెమికల్స్‌ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు, పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ కారణంగానే చైనా క్రాకర్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అలాగే చైనా క్రాకర్స్‌ అమ్మినా, అక్రమంగా తరలించినా, కొనుగోలు చేసినా కూడా 1962 కస్టమ్స్‌ చట్టం ప్రకారం శిక్షార్హులేనని ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పటికే దీనికి సంబంధించి సర్క్యులర్‌ను కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఈసారి బాణాసంచా ధరలు గత సంవత్సరం కంటే దాదాపు 30 నుంచి 40శాతం అధికం అయినట్టు మన దేశ వ్యాపారులు చెబుతున్నారు. దీంతో క్రాకర్స్‌ కొనాలంటేనే చాలా మంది జడుసుకుంటున్నారని... గత సంవత్సరం వెయ్యి రూపాయలు ఖర్చు చేసిన వారు ఈసారి 500 మాత్రమే ఖర్చు చేస్తున్నామని అంటున్నారు. దీంతో ఈసారి బాణాసంచా వ్యాపారం సగానికి సగం పడిపోయినట్టు వ్యాపారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


కాగా సందట్లో సడేమియా లాగా కొందరు వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా చైనా క్రాకర్స్‌ను అమ్ముతున్నారు. షాపుల ముందు బోర్డులు స్టాండర్డ్ క్రాకర్స్ అనే బోర్డే కనిపిస్తుంది. మరి నిజానికి అవి దేశీయ కంపెనీ టపాసులేనా అంటే కానే కాదు అన్న సమాధానం వినిపిస్తుంది. బోర్డు స్టాండర్డ్ అని కనిపిస్తున్నా... మాల్ మాత్రం చైనాదే! సైలెంట్‌గా ఇండియాలోకి ఎంటర్ అవుతోన్న డ్రాగన్ కంట్రీ టపాసులు... ఇండియన్ మార్కెట్‌ను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయ్. జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయ్.


కావున ఈ విషయంలో కొనుగోలు దారులు కాస్తజాగ్రత్గగా ఉండడం అవసరం. తక్కువ ధరకే వస్తున్నాయని కదా అని చైనా క్రాకర్‌ కొనుగోలుచేస్తే ప్రమాదాలతోపాటు, ప్రభుత్వం ప్రకటించినట్టుగా శిక్షపడే అవకాశం వుంది. కేవలం పర్యావరణానికి హానిచేయని, సురక్షితమైన బాణాసంచా మన దేశీయ బాణా సంచా అందుబాటులో ఉంది. కావున కొనే ముందు ప్రతి ఒక్కరు గమనించి ఈ దీపావళిని జరుపుకోవాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: