1500 ఏళ్ళ చరిత్ర గలిగిన ఆలయ విశేషాలు మీ కోసం

Suma Kallamadi
తెలంగాణాలో యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాల నగరం గ్రామం ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు పచ్చని పంట పొలాలతో నిండి ఉన్న గ్రామం. ఈ గ్రామంలో లేని ఆలయం అంటూ లేదు. ఎటు చూసిన ఆలయాలు దర్శనం కనిపిస్తుంది. సకల దేవతలు ఇంద్రపాల నగరంలో  కొలువయి ఉన్నారు. ఈ ఇంద్రపాల నగరానికి ఘనమైన చరిత్ర ఉంది. క్రీ.శ 4 వ శతాబ్దంలో విష్ణు కుండినులు రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. వీరి  చరిత్రకు సంబంధించిన పురాతన శాసనాలు ఇక్కడ లభ్యం అయ్యాయి. ఇంద్రపురి గ్రామం క్రమేపి ఇంద్రపాల నగరంగా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా ఈ గ్రామంలో 1500 ఎకరాల విస్తరించిన పెద్ద చెరువు ఈ గ్రామాన్ని సస్యశామల చేస్తుంది. ఈ చెరువు ఎప్పుడు నీటి తో కలకల ఆడుతుంది.  


హిందూ పురాణల  ప్రకారం మొత్తం విశ్వంలో ౩౩ కోట్ల దేవుళ్ళు ఉన్నారు. వారిలో ఎక్కవ మంది పూజించేది, ఆరాధించేది ఆ కైలాసనాదుడినే. ఐతే భారతదేశంలో ఎక్కడ చూసిన శివుని మందిరాలు మనకు కనిపిస్తుంటాయి. వాటిలో పూర్వ, చారిత్రాత్మక ఆలయాలు దర్శించుకుంటే మంచిదని పెద్దలు చెప్తుంటారు. ఇంద్రపాల నగరం గ్రామంలో గల ఆలయాలలో పురాతన ఆలయం శివాలయం. ఈ ఆలయం 40 స్తంభాలతో నిర్మించారు. ఈ ఆలయం ముందు రెండు అంతస్తులు గల కళ్యాణ మండపం గలదు. ఈ శివాలయం క్రీ.శ 388 నుండి 624 మధ్యలో నిర్మించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. ఈ ఆలయానికి దక్షిణాన భాగంలో పెద్ద చెరువుతో పాటు ఉత్తరాన పెద్ద గుట్ట తో పాటు మూసి నది ఉంది. దూరంగా పొలాలు చుట్టూ చెరువు, ఆధ్యాత్మికత తో పాటు శతాబ్దాల చరిత్ర ఈ ఆలయం సొంతం. 


భక్తులు కోరిన కోర్కెలు ఆ శివయ్యా తప్పకుండ తీరుస్తాడని గ్రామస్తులు నమ్మకం. ఆ నమ్మకంతో గ్రామస్తులు ప్రతి సంవత్సరం శివరాత్రికి ఘనంగా పూజలు, జాతర నిర్వహిస్తారు. ఈ సందర్బంగా ఆలయం ముందు అగ్ని గుండాలు ఏర్పాటు చేసి, ప్రజలు నిప్పుల పై నడుస్తారు. అనంతరం దేవునికి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. ఈ జాతరకు ప్రతి సంవత్సరం ఆడపడుచులను ఇళ్లకు పిలుచుకొని ఘనంగా పండగ నిర్వహిస్తారు.

ఈ జాతరలో పాల్గొంటే వర్షాలు పడి పంటలు పండి సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా బతుకుతామని వారి నమ్మకం. చుట్టుపక్క గ్రామాలకు ఎంత కరువు వచ్చిన ఇక్కడి చెరువు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎండిపోలేదని గ్రామస్తులు చెపుతుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: