విష్ణుస్వరూపమైన రావిచెట్టుని ఇంట్లో పెంచకూడదంటారు ఎందుకు ?

Durga
దేవాలయాలలోని రావిచెట్టుకి, వేపచెట్టుకి ప్రదక్షిణలు చేయడం, పూజలు చేయడం జరుగుతూ ఉంటుంది. రావి చెట్టును విష్ణు స్వరూపంగా భావించి, ఆరాధిస్తుంటారు. మరికొందరు రావి చెట్టును బ్రహ్మ,విష్ణువు, మహేశ్వరులైన త్రిమూర్తుల స్వరూపంగా భావించి పూజలు చేస్తుంటారు. అలాగే శనిగ్రహదోషాలు నివారణ కావడానికి కూడా రావి చెట్టుకు ప్రదక్షిణలు చయడం, రావిచెట్టును కౌగిలించుకోవడం వంటి వెన్నో చేస్తుంటారు. అటువంటి మహత్తర శక్తి గల రావి (అశ్వచెట్టును) ఇంట్లో పెరగనీయకూడదని అనర్ధమని, కీడు జరగుతుంది అని అంటారేమిటని చాలామందికి సందేహం కలుగుతుంది. రావిచెట్టును పెరగనిస్తే పెద్ద వృక్షంగా తయారవుతుంది. వందల సంవత్సరాలు అలానే ఉంటుంది. దీని వేర్లు భూమి కింద చుట్టూ కొన్ని కి.మీ దూరం వరకూ బలంగా వ్యాపిస్తాయి. ఇంటి ప్రాంగణంలో దీనిని పెంచినట్లయితే దాని వేర్లకు అడ్డం వచ్చిన ఇంటిని సైతం పెకలించివేస్తుంది. ఇల్లు కూలిపోయే అవకాశం ఉంటుంది. అలాగే వర్షాకాలంలో వీచే గాలులకి దాని కొమ్మలు విరిగి ఎవరి మీదైనా పడే అవకాశం కూడా ఉంది. అలాగే ఈ చెట్టుపై గూడు పెట్టుకొన్న పక్షులకూ కూడా ప్రమాదముంటుంది. కనుకనే పెద్దలు రావిచెట్టుని ఇంట్లో పెరగనీయకూడదు అని చెప్పారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: