అయ్యప్ప స్వామి : “ముద్రకాయ” విశిష్టత

శబరిమలలో స్వామివారికి అభిషేకం కావింపబడిన ఇరుముడిలోని “ముద్రకాయ” లో వున్న నేతిని మనకు ప్రసాదముగా, గురుస్వామి పంచి ఇస్తాడు. అ నేతిని మనమేమి చేయాలి? అనేది మీ ప్రశ్న అయితే, ఇందుకు సమాధానం తెలుసుకోవాలంటే, ముందు ముద్రకాయ విశిష్టత తెలుసుకోవాలి.

 


ఇరుముడి కట్టుకొన్నప్పుడు తొలుత గురుస్వామి మనచే, ముద్రకాయను నేతితో మనచే నింపిస్తారు.  కొబ్బరికాయ అనగా దానిని మన కాయముగా (స్థూల శరీరముగా) భావించ వలేను, కొబ్బరికాయ పిలక మన అహంకారము. పీచు మానవునికి గల ఇహలోక బంధాలు. పిలకను తీయడం మన అహంకారమును త్రుంచి వేయుటయే. ఈ లోకమునకు గల బంధాలనన్నింటిని త్యజించుటయే, పీచును పూర్తిగా తీసి వేయుట, అంటే మన బంధాలన్నింటిని మననుండి వేరు చేస్తున్నామన్న మాట. బందాలను పూర్తిగా తొలగించాలంటే, “భక్తి”  అనే రాతిపై తిక్కి అరగదీస్తే, అవి మననుండి వేరు కాబడుతాయి. అలా చేసిన కొబ్బరికాయకు మూడు కన్నులు (రంద్రాలు) కనిపిస్తాయి. అందులో ఒక కన్ను జ్ఞాననేత్రము, ఆ నేత్రాన్ని తెరవాలి.

 

అందుకు దానికి రంద్రము చేస్తాము. మనం “సంకల్పం" అనే పనిముట్టుచే రంద్రము చేసి, మోహమనే కొబ్బరి నీటిని అందులోనుంచి తొలగించి, “ప్రణవము” అనే అగ్నికి చూపించాలి అప్పుడు “మోహం” పూర్తిగా తొలగిపోతుంది. అందులో మనం “ జ్ఞానం” అనే  నేతిని నింపాలి. అటుపిమ్మట మన "నేర్పు” అనే బిరడాతో మూయలి. ఆపై “ఆశయం” ఆనే లక్కను వుంచి, "ఆయనే నీవు” అనే అప్పడం పెట్టాలి. అదియే “సోహం” అనగా స + హమ్ = ‘అతడే నీవు’, ‘నీవే అతడు’  అని అర్థముగా భావించవలేను. ఆ అప్పడంపైన “అభ్యర్దము” అనే విభూతిని చల్లాలి. అప్పుడు ఆ ముద్రకాయను “వైరాగ్యం” అనే సంచిలో పెడతాడు గురుస్వామి. బంధాలన్నీ తెంచుకొనిన ఆ భక్తుడికి “వీడ్కోలు” పలుకునట్లు, తల్లి, {{RelevantDataTitle}}