తిరుమల భక్తులకు షాకింగ్ న్యూస్...

frame తిరుమల భక్తులకు షాకింగ్ న్యూస్...

Suma Kallamadi

తిరుమలలో  కొత్త సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేయడం జరిగింది. రద్దు  చేసిన ప్రత్యేక దర్శనాల వివరాలు ఇలా   దాతలు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాలను తాజగా ఒక ప్రకటనలో తెలియచేయడం జరిగింది. ఇందుకు ముఖ్య కారణం ఏమి అని అనుకుంటున్నారా... ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా డిసెంబరు 30 నుంచి జనవరి 1 వరకు, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 4 నుంచి 7 వరకు ప్రత్యేక దర్శనాలు, గదుల కేటాయింపు కోసం రద్దు చేయడం జరిగింది అని స్పష్టంగా తెలియచేయడం జరిగింది. అలాగే డిసెంబరు 31, జనవరి 1, జనవరి 5 నుంచి 7 వరకు వృద్ధులు, వికలాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాల కోటా కూడా రద్దు చేసినట్లు కూడా తెలియచేయడం జరిగింది.

 


వాస్తవానికి తిరుమలకి  శ్రీవారి దర్శనం కోసం వస్తున్న సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు, ఐదేళ్లలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లు చేస్తున్నా విషయం అందరికి  తెలిసిందే కదా. వీరికి  నెలలో రెండు రోజుల పాటు టీటీడీ ప్రత్యేక దర్శనాల అవకాశం కూడా కల్పిస్తుంది టీటీడీ. ఇక ఈ రెండు రోజుల్లో ఉదయం 10 గంటల స్లాట్‌కు 1,000, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేలు, 3 గంటల స్లాట్‌కు 1,000 టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది. ఇక  సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు ఎదురుకోకుండా  ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సేవలతో పాటు ఐదేళ్లలోపు చంటి పిల్లల తల్లిదండ్రులకు ఉదయం 9 గంటలు, మధ్యాహ్నం 1.30 గంటలకు సుపథం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది.


ఇది ఇలా ఉండగా.. తిరుమ‌లలో ఒక ప్రాంతం నుంచి మ‌రొక ప్రాంతానికి ఇబ్బందులు లేకుండా చేరుకునేందుకు వీలుగా ఉచిత బ‌స్సుల సంఖ్య‌ను కూడా పెంచబోతుంది. ఇక  టీటీడీలోని వివిధ ప్రాజెక్టుల‌కు సంబంధించిన కార్య‌క్ర‌మాల‌తో వార్షిక క్యాలెండ‌ర్ కూడా భక్తులకు అందించబితున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: