తిరుమల సమాచారం 31-12-2019

Hareesh

ఓం నమో వేంకటేశాయ!!

 

• ఈ రోజు సోమవారం,31.12.2019 ఉదయం 06 గంటల సమయానికి,తిరుమల: 16C°-23℃°

 

• నిన్న 54,333 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.

 

• వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 13 గదుల్లో భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు.

 

 • ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 12 గంటలు పట్టవచ్చును.

 

• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు
  ₹: 2.19 కోట్లు.

 

•  శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.

 

• ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి.

 

గమనిక :

• రేపు స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం,

 

• ఆంగ్ల సంవత్సరాది సంద‌ర్భంగా డిసెంబరు 31 నుండి జనవరి 1వ తేదీ వరకు, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 4 నుండి 7వ తేదీ వరకు దాతలకు ప్రత్యేక దర్శనాలు, గదుల కేటాయింపును నిలిపివేయ‌డ‌మైన‌ది.

 

• భక్తుల రద్దీ నేపథ్యంలో నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 5 నుండి 7వ తేదీ వరకు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రుల  ప్రత్యేక దర్శనాలు ర‌ద్దు చేయ‌డ‌మైన‌ది.

 

తిరుప్పావై

ధనుర్మాసం కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు. ధనుర్మాసం ఉభయ సంధ్యల్లో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం తొలగి అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు. దీన్నే బాలభోగం అంటారు. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకూ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: