భోగి: ధ‌నుర్మాసంలో భోగి విశిష్ట‌త గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇవే..!

Kumar Vinod

భోగభాగ్యాలను కలగజేసేది భోగి పండుగ. సంక్రాంతి పండుగ రాకముందే ధనుర్మాస సందడి ఆరంభమవుతుంది. ఈ అత్యంత విశిష్టమైన వ్రతమును మార్గశీర్ష వ్రతము, ధనుర్మాస వ్రతము అని పిలుస్తుంటారు. సూర్యనారాయణ మూర్తి ధనస్సు రాశిలో ప్రారంభమై.. భోగి పండుగ వరకూ.. ఇంకా సూర్యనారాయణ మూర్తి మకర రాశిలోకి ప్రవేశించే వరకు ఉన్న సమయాన్ని ధనుర్మాసం అంటారు. ధనుర్మాసం విష్ణుమూర్తికి ప్రియమైనది కాబట్టి ఆ స్వామికి పూజలు చేసి, ఆయనకు ఇష్టమైనవి సమర్పిస్తే మంచిది.




మీకు ఉన్నటువంటి ఎంత కఠినమైన కష్టాలనైనా విష్ణుమూర్తి స్వామికి చెప్పుకొని అవి తొలగిపోవాలని కోరుకోవచ్చు. విష్ణుమూర్తికి తులసి మాల అంటే చాలా ఇష్టం. అందుకే ధనుర్మాసంలో ఎవరైతే తులసి మాలను విష్ణుమూర్తి అవతారాల్లో ఏ దేవుని కైనా ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే.. మీ అప్పులు కానీ ఇతర ఏ సమస్యలు అయినా తొలగిపోతాయి. అలాగే ధనుర్మాసంలో ప్రతిరోజూ ఇలా చేయడం ద్వారా మీకు ఫలితం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


భోగి విశిష్టత గురించి తెలుసుకుంటే.. భోగి రోజు ఉదయాన్నే నిద్ర లేచి భోగిమంటలు వేస్తుంటారు ప్రజలు. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలతో పాటు.. దృష్టిలోపం కూడా తొలగిపోతుందని చెబుతుంటారు పండితులు. చిన్న పిల్లలకు నలుగు పెట్టి తలంటు స్నానం చేయించి కొత్త బట్టల తొడుగుతారు. ఆ తర్వాత చిన్న పిల్లలను ఇంట్లో కూర్చోబెట్టి... ఇరుగుపొరుగువారితో భోగి పళ్ళును, పూలను, నాణేలను ధారలాగా పోయిస్తుంటారు.



ఇలా చేస్తే చిన్న పిల్లల యొక్క ఆయుష్షు పెరుగుతుందని, ఐశ్వర్యవంతులు అవుతారని నమ్మకం. ఈ విధంగా చిన్న పిల్లలు పెద్దల ఆశీస్సులు తీసుకోవడం ఎప్పటినుండో ఆచారంగా వస్తోంది. నిజానికి మకర సంక్రాంతి అనేది పెద్దల నుంచి ఆశీర్వచనాలు తీసుకునే పండగగా భావిస్తుంటారు. సో, మీ పిల్లలు మంచిగా చదువుకోవాలని, వారి భవిష్యత్తు బాగుండాలని ఆశించిన తల్లిదండ్రులు భోగి పళ్ళను, పూలను, నాణేలను మీ చిన్నపిల్లలపై పోయించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: