ఆనంద సంక్రాంతి: సాంప్రదాయాలు మ‌రో త‌రం బ‌తికించండి..!

సంక్రాంతి అనగానే సాంప్రదాయానికి ప్రతీక. ఎన్నో సాంప్రదాయాలను మనకు కళ్ళకు కట్టినట్టు చూపించే అతి పెద్ద పండగ సంక్రాంతి. నగరాలు, పట్టణాల్లో కంటే మన తెలుగింటి గ్రామాల్లో పండగను బాగా చేస్తారు. ఈ పండుగ అన్ని వర్గాల్లోనూ సంతోషం నింపుతుంది.

ప్రత్యేకించి పల్లెటూళ్లు ఈ నాలుగు రోజులూ కళకళలాడతాయి. అయితే ఇప్పుడు చాలా వరకూ పల్లెల్లో వలసలు పెరిగాయి. సమీపంలో ఉన్న పట్టణాలకో లేక హైదరాబాద్ వంటి మహానగరాలకో జనం ఉపాధి కోసం వలస వెళ్తున్నారు. అలాంటి వారి పిల్లలకు పండుగ విలువ, సంప్రదాయాలు తెలియడం లేదు.

అందుకే మీరు మీ గ్రామం వెళ్లినప్పుడు.. కేవలం సంబరాలపైనే దృష్టి పెట్టకుండా సంక్రాంతి సంప్రదాయాల గురించి పిల్లలకు వివరించండి.. భోగి మంటలు ఎందుకు వేస్తారు.. భోగి పళ్లు ఎందుకు పోస్తారు.. కోడి పందేలు ఎందుకు వేస్తారు.. భోగి స్నానం ప్రత్యేకత ఏంటి..

అసలు సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాం... కనుమ రోజు ఎందుకు పశువులను పూజిస్తాం.. ఇలాంటి ఎన్నో విషయాలను మీ పిల్లలకు వివరించండి. మీకే తెలియకపోతే.. మీ పెద్దవాళ్లను అడిగి తెలుసుకోండి. ఇలా చేయడం ద్వారా ఇలాంటి అతి పెద్ద పండుగ తర్వాతి తరాలకూ అందుతుంది. తన సంస్కృతీ సౌరభాన్ని తరతరాలకు అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: