అల్లా: ముస్లింల పై ఉపవాసాలు ఎప్పుడు ఫర్జ్ అయ్యాయి...?
ఉపవాసం ఏదయినా సంకల్పం తప్పనిసరి. తేడా ఏమిటంటే, ఫర్జ్ ఉపవాసానికి ఫజ్రె సాదిఖ్కి ముందే సంకల్పం చేసుకోవాలి. నపీల్ ఉపవాసానికి కాస్త ఆలస్యంగానయినా సరే సంకల్పం చేసుకునే అనుమతి ఉంటుంది. ఉపవాసం ఔన్నత్యం ఎంతో ఘనమయినది. ప్రవక్త (స) ఇలా అన్నారు: ”నిశ్చయంగా స్వర్గానికి గల (ఎనిమిది) తలుపుల్లో ఓ తలుపు పేరు ‘రయ్యాన్’. రేపు ప్రళయ దినాన ఈ మార్గం గుండా కేవలం ఉపవాస దీకకులు మాత్రమే ప్రవేశిస్తారు. వారికి తప్ప ఇంకెవ్వరికి ఆ మార్గం గుండా ప్రవేశం ఉండదు….” (బుఖారీ, ముస్లిం) రమజాను ఉపవాసాలు విధి. ఇవి తప్ప మిగతా ఉపవాసాలు నఫిల్గా ఉంటాయి. పుణ్యం ప్రతి విధమయినటువిం ఉపవాసానికి లభిస్తుంది. అయితే ”రమజాను సాంతం ఉపవాసాలున్న వ్యక్తి గత పాపాలన్నీ మన్నించ బడతాయి” అన్నారు ప్రవక్త ముహమ్మద్ (స). (ముత్తఫఖున్ ఆలైహి)