తిరుమల సమాచారం 10-02-2020

Hareesh

ఓం నమో వేంకటేశాయ!!

 

• ఈరోజు సోమవారం,10.02.2020 ఉదయం 5 గంటల సమయానికి,తిరుమల: 16C°-26C°.

 

• నిన్న 88,072 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం లభించింది.

 

• వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 22 కంపార్ట్మెంట్ లలో సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు.

 

 • ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 08 గంటలు
   పట్టవచ్చును.

 

• నిన్న 26,934 మంది భక్తులు స్వామి వారికి  తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

 

• నిన్న స్వామివారికి హుండీ లో భక్తులు సమర్పించిన నగదు ₹: 3.33 కోట్లు.

 

• శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.

 

గమనిక:

 

• ఫిబ్రవరి 21న గోగ‌ర్భ తీర్థంలోని క్షేత్ర‌పాల‌కునికి మ‌హాశివ‌రాత్రి వేడుక‌లు.

 

• ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి.

 

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌

 

తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది కావున లెమ్ము స్వామి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: