786 అంటే ముస్లింలకు సెంటిమెంట్ నెంబర్ అని లేకపోతే... ఆ నెంబర్ వాళ్ళ లక్కీ నెంబర్ అని లేదంటే...ఆ నెంబర్ వాళ్ళకు మంచి చేస్తుంది అనే నమ్మకం వాళ్ళకు ఉంటుందని ఇలా రక రకాల ఆలోచనలు కలిగి ఉన్నారు. చాలా మంది ముస్లింలకు అసలు ఆ సంఖ్య యొక్క విలువ కూడా తెలియదు. కానీ ఆ సంఖ్య కనపడితే చాలు అమ్మో ఇది ముస్లింలది అని ఆ నెంబర్‌ని వాళ్ళ ఫోన్ నెంబర్‌లోనో మరెందులోనో జోడించుకోవడం కోసం ఎంతో డబ్బులు కూడా ఖర్చు పెడుతుంటారు. ఎందుకు దాని బదులు ఎవరైనా లేనివాడికి ఒక పూట భోజనం పెట్టినంత ఉత్తమం లేదు. మనం ఆ సంఖ్య కోసం కనీసం ఒక రెండు వేలు పెట్టి కొంటాం దాని బదులు ఒక పదిమందికి అన్నం పెట్టొచ్చు అంటున్నారు ముస్లిం మత పెద్దలు. ఆ నెంబర్ కోసం అంత ఖర్చు పెట్టా ఇంత ఖర్చు పెట్టా అంటారు. కానీ దాని వల్ల ఎవరికి ఉపకారం ఒక్కసారి ఆలోచించండి.
ఈ నెంబర్‌తో పిచ్చ. ఈ నెంబర్‌తో ఏదో జరుగుద్ది. లేదంటే ఈ నెంబర్‌తో ఇస్లాంతో ఏదో సంబంధం ఉంది. ఈ నెంబర్ ఏదో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంది అని కొందరు అనుకుంటు ఉంటారు. కానీ ఏం జరగదు. ఆ నెంబర్ గురించి ఖురాన్ హదీసుల్లో ఎక్కడా చెప్పబడలేదు. ఇలాంటి నెంబర్ల మీద మమకారం నెంబర్ల మీద నమ్మకంతోటి డబ్బులు అనవసరంగా వృధాగా ఖర్చు పెట్టవద్దు. జీవితాన్ని నెంబర్లకు అంకితం చేయకండి. మన జీవితాన్ని కేవలం అల్లాకి అల్లా యొక్క ప్రవక్తలకి నచ్చే పనుల్లో అంకితం చేయాలి. సంవత్సరాంలో మనకున్న డబ్బుల్లో జకాత్ తీయమంటాడు భగవంతుడు. కానీ అది మాత్రం చేయరు. జకాత్ అనగా మనం సంపాదించేదాంట్లో కొంతైనా పేదవారికి ఇవ్వమంటాడు అల్లా.
జకాత్ అనగానే చాలా మంది జకాత్ అంటే నేను చాలా దానధర్మాలు చేస్తాను అని అనుకుంటారు. కానీ అలా కాదు. మనం చాలా దాన ధర్మాలు చేయడం వేరు పనిగట్టుకుని జకాత్ లెక్కపెట్టి తీయడం వేరు. 786కు ఇస్లామ్‌లో ప్రత్యేకమైన ఒక స్థానం అంటూ ఏమీ లేదు. దీని కోసం అనవసరంగా డబ్బులు వృధా చేయకండి. చాలామంది 786 అంటే `బిస్మిల్లా ఇర్రహ్‌మాన్ నిర్రహీమ్` అంటారు కాని దాని అర్ధం అది కాదు. కొందరు బిస్‌మిల్లా ఇర్రహ్‌మాన్ నిర్రహీమ్ అనేది మొత్తం సంఖ్య పరంగా కౌంట్ చేసిన తర్వాత వచ్చే సంఖ్య అంటారు. కాని ఏ రకంగాను ఇది కరెక్ట్ కాదు. అంతేకాక ఈ సంఖ్యకు ఇస్లాంలో ప్రత్యేకమైన స్థానం అనేది ఎక్కడా లేదు. అలాగే మనం `బిస్మిల్లా` అనేది రాయాలి కాని అలా సంఖ్యలో రాయకూడదు.
మరింత సమాచారం తెలుసుకోండి: