ద్రాక్షారామం - ఈ ఒక్క శివాలయాన్ని దర్శిస్తే...అన్ని శివాలయాలు దర్శించినట్టే..!!!

NCR

ఓం నమఃశ్శివాయ..శివరాత్రి పర్వదిన సంధర్భంగా అభిషేకాలతో, శివ భక్తులతో చిన్న,పెద్ద ఎన్నో శివక్షేత్రాలు కిటకిటలాడుతాయి. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచారామాలు వేలమంది భక్తులతో కిక్కిరిసిపోతాయి. ఈ ఐదు పంచారామాలు ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకున్నవే అయినా ద్రాక్షారామం శివ క్షేత్రానికి మాత్రం ఎంతో విశిష్టమైన ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలోకి ప్రవేశించ గానే ఎంతో తెలియని అనుభూతి కలుగుతుంది. అంతేకాదు దేవతలు నిర్మించిన గుడి కావడంతో దేవాది దేవతలు అందరూ కొలువై ఉంటారని పురాణాలు చెప్తున్నాయి.

 

పంచారామాల పురాణ గాథ..

స్కాంద పురాణం ప్రకారం, పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుని కోసం ఘోర తపస్సు చేసి, శివునిచే వరాలు పొందాడు. అవి, తన మరణం బాలుడి చేతిలో మాత్రమే ఉండాలని, మరొకటి  శివుని ఆత్మలింగాన్ని తనలో ఐక్యం చేయమని. భోలాశంకరుడు రెండో వారాలని ప్రసాదించగా  అంతటి వరగార్వుడై, తారకాసురుడు దేవతలను వేధించసాగాడు. దాంతో వేరే దారి లేక దేవతలు పరమశివుడను వేడుకోగా కుమారస్వామి జననం జరిగి తారకాసురుని వధ జరిగింది. ఆ  సమయంలో తరకాసురునిలో ఉన్న ఆత్మలింగము 5 ముక్కలుగా వేరువేరు ప్రదేశాలలో పడి  నేటి పంచారామాలుగా పిలువబడుతున్నాయి.  వీటిని వివిధ దేవతలు ఆ ప్రదేశాలలో ప్రతిష్టించారు. అయితే....

ఈ ప్రదేశంలో పూర్వం దక్షప్రజాపతి నివసిన్చేవదని అందుకే ఆ పేరువచ్చిందని చెప్పుకుంటారు. అంతేకాక, ఇంకో నానుడి ఇక్కడ ద్రాక్షతోటలు ఎక్కువగా ఉండేవని, అందుకే కాలక్రమేనా దీనికి ద్రాక్షారామము అనే పేరు వచ్చిందట. తూర్పు చాళుక్యులు కాలంలో క్రీ.శ.892 –922 మధ్య నిర్మితమైన ఈ క్షేత్ర గోడలపై 800 పైగా శాశనాలు ఉన్నాయి. ఈ క్షేత్ర విశేషాలు కోకొల్లలు. వాటిలో కొన్ని తెలుసుకుందాం.

 

అష్టాదశ పీఠాలలో ఒకటి ఇక్కడి మానిక్యాంబ అమ్మవారు పీఠం:

 

దక్షప్రజాపతి ఈ ప్రదేశంలో ఒక యజ్ఞం చేయ తలపెట్టాడు. అందుకు అందరికి ఆహ్వానాన్ని అందించాడు కాని, తన అల్లుడైన శివునికి మాత్రం ఆహ్వానం పంపలేదు. గతంలో ఇద్దరు ఎదురుపడినప్పుడు శివుడి అతనికి అభివాదం చేయలేదన్న విషయాన్నీ మనసులో పెట్టుకొని ఆహ్వానం అందించలేదట. కాని, పుట్టింటిలో జరిగే వేడుకక వెళ్ళాలని పార్వతీదేవి పరమశివుణ్ణి అడిగిందట, శివుడి ఒప్పుకోకపోగా, పిలువని పేరంటానికి  వెళ్ళకూడదని హితవు పలికాడట. అయితే పార్వతిదేవి వినకుండా శివున్ని ఒప్పించి అక్కడకు వెళ్ళింది. యజ్ఞానికి చేరుకున్న పార్వతికి ఎలాంటి పలకరింపు లేదు, ఎవరు ప్రేమాభిమానాలు చూపించలేదు. ఇంతటి అవమానికి గురైనా పార్వతీ దేవి అక్కడ ఉండలేక, తిరిగి వెళ్లి శివుడికి చెప్పలేక మనసు విరిగి ఆత్మాహుతి చేసుకుంది. ఈ విషయాన్ని  తెలుసుకున్న శివుడి తన జటము నుంచీ ఉద్భవించిన వీరబద్రుడిని అక్కడికి పంపి దక్ష యజ్ఞాన్ని నాశనం చేయమని చెప్పాడట. ఆ తరువాత శివుడు పార్వతీ దేవి సూక్ష్మ శరీరాన్ని భుజాన వేసుకొని వెళుతున్న సమయంలో, శివుని ఆవేశాన్ని ఆపడానికై మహా విష్ణువు తన చక్రాయుధంతో పార్వతీ దేవి సూక్ష్మ శరీరాన్ని ముక్కలు చేయగా, అవి 18 ముక్కలై 18 ప్రదేశాలలో పడ్డాయని  అవే అష్టాదశ శక్తిపీఠాలుగా రూపాంతరం చెందాయని తెలుస్తోంది. ఒకటి మాణిక్యాంబాగా ఇక్కడ కొలువు తీరారు.

 

ఇంతేనా ఈ క్షేత్ర విశేషాలు చెప్పుకోవాలేగాని ఎన్నో, మరెన్నో. వేదవ్యాసుడు కాశీ విశేస్వరుడి ఆగ్రహానికి కాశీని వదిలి పొమ్మనే శాపానికి గురైన సమయంలో, ఇక్కడ భీమేశ్వరుడిని కొలిచిన యడల, కాశీలో నివశించినట్టే అని అన్నపూర్ణాదేవి చెప్పడంవలన వ్యాసుడి ఈ నగరాన్ని చేరుకున్నాడు. వింధ్య పర్వతం గర్వమనిచే కార్యక్రమంలో అగస్త్య మహర్షి ఇక్కడకు వచ్చారని, వ్యాసుడు, అగస్త్య మహర్షి ఇద్దరు కొంతకాలం కలిసి నివసించారని పురాణ కథ.

దాక్షారామం, శ్రీశైలం, శ్రీ కాళహస్తీ మధ్య ఉన్న ప్రదేశాన్ని త్రిలింగ దేశమన్నారు. దీనికి ఉత్తర సరిహద్దుగా దాక్షారామం ఉంది.భీమేశ్వరినికి అభిషేకం చేయడానికి సప్త ఋషులు సప్త గోదావరులను తీసుకువచ్చారు అవి అంతర్వాహినులు. పక్కనే ఒక పానువట్టం మీద ఉండే 108 శివలింగాలను ధర్శించుకున్నచొ అన్ని శివాలయాలు చూసినంత ఫలమాట. భీష్మ ఏకాదశి రోజున భీమేశ్వరస్వామీ, లక్ష్మీ నారాయణ స్వామీ, సూర్యనారాయణ స్వామిల కళ్యాణం  ఒకే వేదికపై జరపడం ఇక్కడ విశేషం. ఈ ఒక్క గుడిలో అందరు దేవతలు కొలువై ఉంటారు..ఈ ఒక్క క్షేత్ర దర్శనంతో సర్వ పాపాలు తొలిగిపోతాయని ప్రతీతి..

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: