శివరాత్రి ఉపవాసం, జాగారం.. ఈ పొరపాట్లు చేస్తే పరమ దరిద్రం చుట్టుకుంటుంది..!
శివపురాణంలో శివరాత్రి పూజ విధానాన్ని శ్రీకృష్ణుడుకి ఉపమన్యు మహర్షి వివరించాడు. ఈ రోజున పరమేశ్వరుణ్ని భక్తులు మూడు విధాలుగా పూజిస్తారు. అవి.. శివపూజ, ఉపవాసం, జాగారం. వీటిలో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. మహాశివరాత్రినాడు ఉపవాసం చేసి శివనామ స్మరణ చేయడం కన్నా ముఖ్యమైంది మరొకటి లేదు. ఉపవాసం వల్ల శారీరక శుద్ధి, జాగారం చేస్తూ ధ్యానం చేయడం వల్ల మనోశుద్ధి కలుగుతాయి.
ఉపవాసం అంటే మనసును శివుడికి దగ్గరగా ఉంచడమని వేద పండితులు పేర్కొంటున్నారు. ఆదిదేవుడికి దగ్గరగా మనసును ఉంచాలంటే శివధ్యానం చేయాలి. శివధ్యానం చేస్తే శివానందం కలుగుతుంది. శంకరుని అనుగ్రహం లభిస్తుంది. శివధ్యానం చేయాలంటే రోజంతా మేల్కొని ఉండాలి. మేల్కొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచాలి.
కాబట్టి ఎంతో నియమ నిష్టలతో ఉపవాసం ఉండి, మహాదేవుణ్ని ధ్యానించాలి. వాస్తవానికి మహాశివరాత్రినాడు శివధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలే వేయదట. కానీ, కాలంలో బీపీ, మధుమేహం లాంటి వ్యాధులు చాలా మందిని బాధిస్తుండంతో కొద్ది మొత్తంలో అల్పాహారాన్ని తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఇలా చేయడం అపచారమే అయినా తప్పదు.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. శివుడు కూడా తన భక్తుల ఆరోగ్యంగా ఉండాలని భావిస్తాడు. కాబట్టి చిన్న చిన్న రోగాలతో బాధపడేవాళ్లు తప్పనిసరి పరిస్థితుల్లో అల్పాహారం తీసుకోవడం తప్పదు. అల్పాహారం అంటే కేవలం పండ్లు మాత్రమే తీసుకోవాలి. ఈ కాలంలో దొరికే అనాస, ద్రాక్ష, జామ వంటి పళ్లను తీసుకోవచ్చని చెపుతున్నారు. ఉపవాసం ఉండి కూడా అంతకు మించి ఆహారం తీసుకుంటే.. ఉపవాసం ఫలం దక్కకపోగా.. శివాగ్రహానికి గురవుతారని పండితులు చెబుతున్నారు.