ఇదెక్కడ ఆచారం రా బాబు.. అమ్మవారి జాతరలో ముద్దులు పెడుతూ డ్యాన్సులు..!
హిందూ సంప్రదాయములో దేవతలను, దేవుళ్లను, పుణ్య స్త్రీలను, మహిమగల స్త్రీ, పురుషలను పూజించడం అనాదిగా వస్తూవుంది. ఏదైనా ఒక దేవతను గాని, దేవుని గాని కొన్ని నిర్ధిష్టమైన రోజులలో పూజించి పండగ చేయడాన్ని జాతర అంటారు. ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామదేవత ఉన్న మన భారతదేశములో లెక్కలేనన్ని జాతరలు.. అనేక ఆచారాలతో జరుగుతూ ఉంటాయి. ఇక జాతర వచ్చిందంటే.. చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా కలిసి ఎంజాయ్ చేస్తారు... ఇక, తమ ఇష్ట దైవానికి పూజలు, పునస్కారాలు, ఊరేగింపులు, సేవలు, రథం ఇలా.. ఒక్కటేంటి? ఆ జాతర జరిగినన్ని రోజులు... రోజుకో విధమైన సేవలతో ఆ దేవతలను, అమ్మవారిని కొలుస్తారు.
కానీ అక్కడ మాత్రం ఒకరినొకరు తెగ ముద్దులు పెట్టుకుంటారు. అలా ముద్దులు పెట్టుకుంటూనే డ్యాన్సులు చేస్తారు. నిజానికి ఇలాంటి గుళ్లల్లో అపవిత్రంగా భావిస్తారు. కానీ అక్కడ మాత్రం అదే ఆచారమట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బళ్లారి జిల్లాకు ఆనుకుని ఉన్న దావణగెర జిల్లా పరిధిలోని మాగానహళ్లి గ్రామంలో ప్రతి పది ఏళ్ల కొకమారు వచ్చే గ్రామ ఊరమ్మ దేవి జాతర ఈ విశిష్టను పొందింది. మాగానహళ్లి గ్రామం దేవత జాతరలో భక్తులు జంటలుగా డ్యాన్స్ చేయడం, ము ద్దులు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం.
అంతేకాదు, చుట్టూ జనాలంతా గుమ్మిగూడి చూస్తున్నా... పబ్లిక్‌గా ముద్దులు పెట్టుకుంటూ వయసుతో సంబంధం లేకుండా భార్యభర్తలు కలిసి డ్యాన్స్ చేయం అక్కడ అనాదిగా వస్తున్న ఆచారం అంటున్నారు. ఈ వింత సాంప్రదాయాన్ని పాటిస్తేనే అమ్మవారు సంతృప్తి చెందుతారని, తామంతా అమ్మవారి కృపకు పాత్రులవుతామని స్థానికుల అపార నమ్మకం. సాధారణంగా జాతరలో తొలుత అమ్మవారికి విశేష అలంకరణలు, పూజలు చేస్తామని, అనంతరం అనాధిగా వస్తున్న ఈ నృత్యాన్ని చేస్తామని వారు పేర్కొంటున్నారు. అయితే ఫస్ట్ టైమ్ చూసేవాళ్లకి మాత్రం ఇదెక్కడ ఆచారం రా బాబు.. అనుకోక మానరు.