బుద్ధ పూర్ణిమ విశిష్టత మీకోసం..!

Suma Kallamadi

 

బుద్ధ పూర్ణిమ..  మహా వైశాఖి... వైశాఖ పూర్ణిమ పేర్లు అనేకం కానీ దీన్ని అందరూ బుద్ధ పూర్ణిమ అని పిలుస్తారు. ఈరోజు ఆధ్యాత్మికత సాధన చేస్తే అది మంచి ఫలితాలనిస్తుందని శాస్త్రం చెబుతోందట. గౌతమ్ బుద్ధుడు పరమ గురువుల పరంపర, అలాగే భూమండల ప్రభువైన సనత్కుమారులు మధ్య వారధిగా ఉండడం వల్ల వైశాఖ పౌర్ణమి ప్రసిద్ధి చెందింది. పది అవతారాలలో కల్కి అవతారం శంబల గ్రామం నుంచి తను అవతరిస్తానని భాగవత పురాణంలో తెలుపబడింది. అలాగే మధ్య హిమాలయాల్లో ఉన్న కలాప గుహలలో ముఖ్య కేంద్రంలో ఈ ప్రేరణను ఆయన అందుకున్నాడని భాగవత పురాణంలో తెలుపబడింది.

 


నిజానికి గౌతమ బుద్ధుని జీవితంలో వైశాఖ పూర్ణిమ అనేది మూడుసార్లు అత్యంత ప్రాముఖ్యతను ప్రసిద్ధిగాంచింది. మొదటి వైశాఖ పౌర్ణమి నాడు అతను జన్మించాడు, తర్వాతి మరో వైశాఖ పౌర్ణమి నాడు జ్ఞానోదయాన్ని పొంది సిద్దార్థుడు గౌతమ బుద్ధుడిగా మారాడు, తర్వాత మూడో వైశాఖ పౌర్ణమి నాడు నిర్యాణం చెందాడు. 

 


బుద్ధుడిగా చేసిన బోధ వృక్షానికి పూజలు చేసే ఆచారం ఆ మహనీయుడు ఉన్న సమయంలోనే మొదలైంది. బోధివృక్షం పూజకు గౌతమ్ బుద్ధుడు అనుమతించాడు. ఇక అప్పటి నుంచి బోధివృక్షం పూజ బౌద్ధులకు చాలా ప్రత్యేకమైంది. సంవత్సర కాలంలో ఒక రోజు వైశాఖ పౌర్ణమి నాడు ఆచారాన్ని కొనసాగించడం పరిపాటిగా మారింది. గౌతమ్ బుద్ధుడు తర్వాత బౌద్ధమతం వహించిన అన్ని దేశాల్లో వైశాఖ పౌర్ణమి నాడు పూజ ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా రంగూన్, పెగు, మాండలే మొదలగు ప్రాంతాలలో బుద్ధ పౌర్ణమి అత్యంత ఘనంగా నియమనిష్టలతో జరుపుతారు.

 

ఇక ఆ రోజు మొత్తం జరిగే ఉత్సవంలో మహిళలు జల భాండాన్ని వారి తలపై ధరించి ముందుకు సాగుతారు. మేళతాళాలు జెండాలు దీపాలు వారితో పాటు తీసుకువస్తారు. అలా వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన మహిళలు అందరు సాయంకాలం సమయంలో అందరూ ఒక చోటకు చేరుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: