బెంగళూరు వాళ్ళు ఈ గుడి గురించి తెలిస్తే తప్పక వెళ్లితీరతారు !

KSK
అయ్యప్ప దేవాలయాలు దేశంలో ఎక్కువగా కేరళలో పవిత్రమైన  శబరి హిల్స్ వద్దే ఉంటాయని అందరూ భావన. కానీ లార్డ్ అయ్యప్ప దేవాలయాలు ఒక్క కేరళ రాష్ట్రంలోనే కాక దక్షిణాదిలో అనేక రాష్ట్రాలలో అనేకమంది దర్శించుకున్న స్థానాలు కూడా ఉన్నాయి. మనకు తెలిసినంత వరకు దేశవ్యాప్తంగా అనేక మంది చేత పూజలందుకునే అయ్యప్ప ఎక్కువగా కేరళ రాష్ట్రం లోనే ఉంటుందనుకుంటాం. కానీ పశ్చిమం వైపు బెంగళూరులో కల జాలహళ్లి లో గల ఓ దేవాలయం  భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ అయ్యప్పను హరిహర సుతుడు అని, శ్రీ ధర్మ శాస్త్రా అని పిలుస్తారు.

అయ్యప్ప ఆలయం బెంగుళూర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది బియిఎల్ సర్కిల్ నుండి 5 కి మీ దూరంలో ఔటర్ రింగ్ రోడ్ లో ఉంది. ఇక్కడ ఆలయం కేరళ శైలి లోనే నిర్మించారు. ఆలయంలో ప్రవేశించండం తోనే ఒక పొడవైన జెండా కర్ర దర్శనమిస్తోంది. జెండా కర్ర అంతా బంగారు పూతతో కూడిన ఉంటుంది. ఇదే ప్రదేశంలో గణపతి మరియు దేవి సుబ్రమణ్య నాగరాజు మరియు నవగ్రహాల ఆలయాలు కూడా ఉన్నాయి. 2004వ సంవత్సరంలో ఈ దేవాలయాన్ని పుననిర్మించారు.

అచ్చం శబరిమల నమూనాలతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. నిత్యం ఈ ఆలయంలో ఏడాది పొడవునా పేదలకు అన్నదానాలు జరుగుతూనే ఉంటాయి. అంతేకాకుండా ఆలయ ప్రాంగణంలో ఒక గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆలయంలో కుల, మత భేదాలు లేకుండా అందరూ దర్శించుకోవచ్చు. ప్రతియేటా దేవాలయం యొక్క వార్షికోత్సవం ధనుర్మాసం స్టార్టింగ్ లో జరుగుతుంది.  అంతేకాకుండా సాంస్కృతిక మరియు మతపరమైన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. బెంగళూరు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అయ్యప్ప భక్తులు ఎక్కువగా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: