కృష్ణాష్టమి రోజు కృష్ణుడితో రాధ‌ను మాత్రమే పూజిస్తారు.. ఎందుకంటే?

Kavya Nekkanti
శ్రీ‌కృష్ణుడి జ‌న్మ‌దిన‌మే.. కృష్ణాష్మ‌మి లేదా గోకులాష్టమి అని అంటారు. ధర్మాన్ని నిలబెట్టడానికి, మానవాళిని సంరక్షించడానికి విష్ణుమూర్తి ఎత్తిన ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణుని అవతారం. విష్ణువు అతి ముఖ్యమైన అవతరాల్లో కృష్ణావతారం ఒకట‌ని అన‌డంలో సందేహం లేదు.. ఎందుకంటే హిందు ధర్మంలో అతిముఖ్యమైన భగవద్గీతను బోధించింది కృష్ణావతారంలోనే. వెన్న దొంగగా, గోప బాలకుడిగా, సోదరునిగా, అసురసంహారిగా, ధర్మసంరక్షకుడిగా ఎన్నో రకాల పాత్రలు పోషించి..  అందరి మనసులను దోచుకున్నాడు. ఇక ఈ రోజు  దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జ‌న్మాష్ట‌మి వేడుక‌లు జ‌రుగుతున్నాయి.

క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి చెందుతున్ననేప‌ధ్యంలో  భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే చిన్నికృష్ణునికి స్వాగ‌త స‌త్కారాలు చేస్తున్నారు. అయితే కృష్ణాష్టమి రోజు కృష్ణుడితో పాటు రాధాను కూడా పూజిస్తారు. వాస్త‌వానికి కృష్టిడికి భగవద్గీత ప్రకారం.. 16,000 మంది గోపికలతో పాటు 8 మంది రుక్మిణి, సత్యభామ, జాంబవతి, నాగ్నజితి, కాళింది, మిత్రవింద, భద్రాదేవి, లక్ష్మణ అనే అష్టభార్య‌లు ఉన్నారు. మ‌రి కృష్ణాష్టమి రోజు కృష్ణుడితో రాధాను మాత్రమే ఎందుకు పూజిస్తారు. ఎందుకంటే.. అనేక మంది భార్యలు ఉన్నా.. కృష్ణుడు రాధనే ఎక్కువగా ప్రేమించాడు.

మహాభారత కథ ప్రకారం గోకులంలో కన్నయ్య కలిసి ఆడుకున్న వారిలో రాధ కూడా ఒకరు. అయితే కన్నయ్య చంపేందుకు కంసుడు ఎంతో మంది రాక్షసులను గోకులంకు పంపేవాడు. వారి నుంచి ర‌క్షించేందుకు చిన్న కృష్ణుడిని నందుడు రేపల్లే బృందావనానికి తీసుకెళ్లాడు. బృందావనానికి వెళ్లడం వల్ల తన ప్రియురాలైన‌ రాధతో ఎక్కువ సమయాన్ని శ్రీకృష్ణుడు గడపలేదు. అంతేకాకుండా కంసుడిని చంపేందుకు గాను కృష్ణుడు మధురకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో రాధ,కృష్ణుల ప్రేమ ముగుస్తుంది. అనంతర రాధకు వేరే వివాహం చేస్తారు.

అయినప్పటికీ తన మనసులో ఎల్లప్పుడూ రాధనే తలుస్తుంటాడు శ్రీ కృష్ణుడు. ఈ విధంగా రాధ జీవితాన్ని సురత్తరుడు తృణీకరించాడు. ఈ కారణంగానే ప్రాపంచిక జీవితంలో కృష్ణుడి మనసులో రాధనే ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. అందుకే రాధా మరియు కృష్ణ అనే పదాలలో ఏ ఒక్కటి లేకపోయినా అసంపూర్ణంగానే ఉంటాయి. ఇక కృష్ణాష్ట‌మి నాడు రాధాకృష్ణులను పూజించడంవల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని న‌మ్ముతారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: