శివం : శివుని కంఠం నీలి రంగులో ఎందుకు ఉంటుందో తెలుసా....?
శివుని కంఠం నీలి రంగులో ఉండటం వెనుక ప్రత్యేకమైన కారణం ఉంది. పురాణాల ప్రకారం దేవుళ్లకు దెయ్యాలు ఎప్పటికీ శత్రువులే. అయితే ఒకసారి దేవుళ్లు, దెయ్యాలు కలిసి పోరాటం మానివేసి క్షీర సాగర మదనం చేశారు. అందులో నుంచి తొలుత కామధేనువు రాగా అది వశిష్టుడికి ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన కల్పవృక్షాన్ని దేవేంద్రుడు తీసుకున్నాడు. తర్వాత చింతామణి పీఠం రాగా దానిని కూడా దెవేంద్రుడే తీసుకున్నాడు.
ఆ తర్వాత చంద్రుడు రాగా చంద్రుడిని ఆకాశానికి పంపించారు. కల్ప వృక్షం, చింతామణి పీఠం తరువాత క్షీర సాగర మధనం నుంచి విషం బయటకు వచ్చింది. విషాన్ని చూసి అందరూ భయపడి శివుడిని ప్రార్థించసాగారు. తనని నమ్ముకున్న వారికి న్యాయం చేయాలని భావించిన శివుడు ఆ విషాన్ని వెంటనే మింగేస్తాడు. అప్పుడు పార్వతిదేవి శివుని కంఠంలో విషాన్ని ఆపివేయుట వలన కంఠం నీలం రంగులోకి మారినది. అప్పటి నుండి శివుడు నీలం రంగు కంఠం కలిగి ఉన్నాడు. ఆ విధంగా శివుడికి నీలకంఠుడు అనే పేరు వచ్చింది.
శివుని నీలి కంఠం ప్రతి సమస్యను భరించాల్సిన అవసరం లేదని... అదే సమయంలో విస్మరించాల్సిన అవసరం లేదని... ఎలాంటి సమస్యను అయినా సమర్థవంతంగా నియంత్రించవచ్చని సూచిస్తుంది. శివుడు ఒక సమయంలో బ్రహ్మకు ఉపదేశం కలిగించడానికి తను అర్ధనారీశ్వర రూపాన్ని ప్రదర్శించాడు. శివుడు పార్వతికి సగ భాగం ఇవ్వడం ద్వారా ఐక్యత గురించి తెలియజేశాడు.