వినాయకుని శరీర ఆకృతి మానవాళికి ఏమి సూచిస్తుందో తెలుసా.. !!

Suma Kallamadi
 వినాయ‌క చ‌వితి వ‌స్తోంద‌న‌గానే పిల్లల్లో పెద్దల్లో  క‌నిపించే సంద‌డి అంతా ఇంతా కాదు. గ‌ణేశుడంటే పిల్లాపెద్దా అంద‌రికీ ఇష్టమే.ఎంతోమంది దేవుళ్లు ఉన్నప్పటికీ మొదట పూజలు అందుకునేది ఆయనే కాబట్టి  ఆ వినాయకుడిని ఆదిదేవుడుగా కొలుస్తారు.మన బొజ్జ గణపయ్యకి అనేక నామాలు ఉన్నాయి. భక్తులు ఎలా పిలిచినా పలికే దేవుడు మన వినాయకుడు. చూడడానికి ఏనుగు తల, మనిషి శరీరం కలిగి ఉండి ఒకే దంతం కలిగి ఉండటంచేత ఏకదంతుడుగా కీర్తించబడుతున్నాడు. మనం వినాయకుడిని చూడగానే తల పెద్దగా ఉండి, ఏనుగుని తలను పోలి ఉంటుంది. అలాగే శరీరం మనిషి ఆకృతిలో ఉంటుంది.వినాయకుని రూపం కూడా చూడడానికికి కనువిందుగా ఉంటుంది.

ఏనుగు ముఖం, తొండం, చేటల వంటి చెవులు, ఏకదంతం, నాలుగు చేతులు, బొజ్జ కలిగి ఉండి, ఎలుక వాహనం, నాలుగు చేతుల్లో నాలుగు ఆయుధాలు, నడుంచుట్టు పామును ధరించి ముఖంలో గొప్ప తేజస్సుతో ఆకర్షణీయంగా ఉంటాడు. విలక్షణమైన రూపు కలిగిన ఆయన రూపంలో ఎంతో పరమార్థం ఉంది. అయన శరీర ఆకృతిలో ఎన్నో ఆలోచింపచేసే గొప్ప భావాలు ఉన్నాయి. స్వామి తల గొప్పగా ఆలోచించమని చెప్తుంది  అలాగే చిన్నగా ఉన్న కళ్లు సూక్ష్మదృష్టితో ప్రపంచన్ని చూడమని అలాగే ఏకాగ్రత కలిగి ఉండాలని సూచిస్తుంది. తొండము స్వాభిమానానికి,పెద్దగా ఉన్న చెవులు శ్రద్దగా వినమని అలాగే అన్నింటిని సమానంగా ఉండమని చెబుతుంది. చిన్ననోరు తక్కువగా మాట్లాడమని సూచిస్తుంది. బొజ్జ చాలా జ్ఞానాన్ని జీర్ణించుకోవాలని, జీవితంలోని ఆటుపోట్లను ఎదుర్కోవాలని, నాలుగు చేతులు ధర్మ, అర్థ, కామ, మోక్షాలను కలిగి ఉండాలని. ఏకదంతం చెడును వదిలి మంచిని కలిగి ఉండాలని సూచిస్తాయి. అలాగే తొండం ఓం ఆకారంలో ఎడమవైపుకి ఉంటుంది. అంటే సూర్యుని శక్తి ఎడమవైపుకి ప్రసరించి ఓర్పు ,సహనం, కలిగి ఉండేలా చేస్తుంది.


దేశంలోని అన్ని ప్రాంతాల్లో గణపతి మండపాలు నిర్మించడంలో  ఒక్కొక్కరు ఒక్కో రకం ప్రత్యేకతలను కనబరుస్తారు. పట్టుదలతో విభిన్నంగా  అలంకరించడానికి ఉత్సాహం చూపుతారు. కొన్నిచోట్ల వినాయకుని ప్రతిమ ఎత్తుగా ఉండటం,పర్యావరణాన్ని కాపాడటానికి మట్టి వినాయకులను తయారు చేసుకొని పూజించాలనే  దృష్టి ఈ మధ్య బాగా పెరిగింది. పూర్వం కాలంలో ఇలాగే ఇండ్లలోనే ఎవరికి వారు  మట్టితో వినాయకుణ్ణి తయారు చేసుకొని పూజించేవారు.అన్ని విఘ్నాలను పోగొట్టి సకల శుభాలను కలిగించే ఘనదైవం వినాయకుడు. కాబట్టి వినాయకున్ని అందరు భక్తి శ్రద్దలతో  పూజించి పూజించి తరించాలని కోరుకుంటున్నాము.. !! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: