మానవ జన్మ ప్రాముఖ్యత...దేవుని చేరు మార్గం..మోక్షం
మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి దేవుడిని చేరువయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ మార్గాన్ని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు. మానవులందరూ పుట్టినప్పటినుండి మంచి పనులు చేయక తప్పదనే విషయాన్ని గ్రహించండి. ప్రతి ఒక్కరూ సంసారం అనే సాగరంలో ఈదుకుంటూ పోవలసిందే. కొన్నికొన్ని పరిస్థితుల్లో ఎన్నెన్ని పనులు చెయ్యాలో అసలు చెప్పక్కర్లేదు. అయినప్పటికీ ఎన్నిపనులు చేసినా ఎన్నని బంధాలతో ముడిపడి ఉన్నా చివరికి అన్నింటినీ వదిలి భగవంతుని ధ్యానంలో లీనమవ్వాల్సిందే.ఈ విధంగా మనిషి సంసార చక్రంలో ఉండి కుటుంబ వ్యవహారాలు సాగిస్తున్న సమయంలో ఉన్నట్టుండి అర్ధంతరంగా పక్కకు తప్పుకుంటే అటు కుటుంబ సభ్యులకూ బాదే. మధ్యలోనే దూరమవుతున్నామని అతనికీ బాధే.... రెండువైపులా ఆందోళన, ఆవేదన ఉంటాయి....
అయితే ఆ వ్యక్తే తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి క్రమంగా బంధపాశాలను త్యజిస్తూ నెమ్మది నెమ్మదిగా జ్ఞానమార్గం వైపు అడుగులు వేస్తూ అందులో మునిగి తేలినప్పు.డు అటు అతనికీ ఇటు కుటుంబ సభ్యులకూ ఎటువంటి బాధ ఉండదు. కాబట్టి మనుషులందరూ ఈ చిన్న విషయాన్ని గమనించి భగవంతుని చేరుకునే మార్గాలను అన్వేషిస్తూ మీ జీవితాలను పరమపావనం చేసుకోండి. బ్రతికినంత కాలం వీలైనంత పుణ్యాన్ని మూటగట్టుకోండి. అప్పుడు తప్పకుండా మనమనుకున్నది నెరవేరుతుంది. బ్రతికినంత కాలం వీలైనంత పుణ్యాన్ని మూటగట్టుకోండి. అందుకే మెల్లమెల్లగా దాని వైపు అడుగులు వేసి దైవ మార్గంలో అడుగులు సారించాలి.