ఈ నియమాలు పాటిస్తే...సకల సౌఖ్యాలు కలుగుతాయి....!

VAMSI
మనం రోజూ తినే ఆహరం కేవలం ఆకలిని మాత్రమే తీర్చదు. తిన్న తరువాత దాని ప్రతిఫలం తిన్నది అరిగే వరకు దాని మనిషిపై తన స్వభావాన్ని చూపిస్తుంది. అందుకే ముఖ్యంగా ఆహారాన్ని వడ్డన చేసేప్పుడు ఎదుటి వ్యక్తితో సంబంధ బాంధవ్యాలు ఏవిధముగా ఉన్నా ఇష్ట పూర్వకంగా ప్రేమతో వడ్డించాలి. అంతేకాకుండా మనం ఆహారాన్ని భుజించేటప్పుడు కూడా ఎంతో ప్రశాంతమైన మనస్సుతో భగవంతుని కృప వలెనే ఈ ఆహారమునకు దక్కుతున్నది అని ఎంతో ప్రమానందముగా స్వీకరించాలి. అన్నం తిన్నాకా తప్పక అన్నధాతకు, వడ్డించిన వారికి, స్థల యజమానికి, సేవ చేసిన వారికి అంటే ధాన్యం పండించినవారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి...ఇక మనం తినే ఆహారంలో ఎలాంటి ప్రభావం కలుగుతుందో చూద్దాం.    

ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని మన పూర్వీకులు,పెద్దలు చెపుతారు. ...

1. అర్ధ దోషం:- ఒక సాధువు  తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో  ఒక వ్యక్తి వచ్చి ఆ శిష్యునికి  ధనంతో వున్న మూటని ఇవ్వడం చూసాడు. భోజనం చేసి, సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు. ఆ గదిలోనే  శిష్యుడు దాచిన డబ్బు మూట వుంది. హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది, ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తన సంచీలో దాచేసాడు...తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని, తిరిగి తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు....మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు.  ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం....మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని భుజించడం ముఖ్యం. ...

2. నిమిత్త దోషం:- మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి....వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాక కూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు  వంటివి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి....

3. స్ధాన దోషం:- ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడిన వంట కూడా పాడైపోతుంది...యుధ్ధ రంగానికి, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంత మంచివి కావు.

4. గుణ దోషం:- మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి. సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది...
రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది....

5. సంస్కార దోషం :-  దుర్యోధనుడు ఒకసారి యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని  విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది. తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి, ఆనంద సంభ్రమాలతో తొందర పాటు పడి, అరటి పండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. ...
కృష్ణుడు దానినే  తీసుకొని  ఆనందంతో భుజించాడు. ...మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి. వడ్డించే సమయంలో అవతలి వ్యక్తీ ఎవరైనా సరే ప్రేమ పూర్వకంగా మాత్రుహృదయంతో వడ్డన చేయాలి...

ఈ నియమాలు పాటించిన వారికి సకల సౌఖ్యాలు కలుగుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: