మీ ఇంట్లో ఈ సూచనలు కనిపిస్తే...లక్ష్మీదేవి వస్తుందని అర్ధం..
లక్ష్మీ దేవి ఇంటికి రావాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. శ్రీ మహాలక్ష్మీ ఎవరి ఇంటికైతే వస్తుందో వారి ఇల్లు పిల్లాపాపలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతుంది. ప్రస్తుతం అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న మంచి రోజులు ఎప్పుడు వస్తాయనేది. ఎందుకంటే కరోనా లాక్ డౌన్ తో తీవ్ర ఆందోళనతో చెందుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. అంతేకాకుండా నిత్యావసర వస్తువలకు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడిప్పుడే దుకాణాలు, ఇతరత్రా సౌకర్యాలు తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. త్వరలోనే దేవుడి దయ వల్ల అంతా మునపటిలా మారబోతుందని భావిస్తున్నారు.
లక్ష్మీ దేవి ఇంటికి వచ్చిందంటే ప్రజలు ఆలోచనలు, వ్యవహారాల్లో మార్పులు వస్తుంది. రాగ-ద్వేషాలు, ఈర్ష్య అసూయలు లాంటివి తగ్గుతాయి. ఆనందం పెంపొందుతుంది. కుటుంబంలో పరస్పర ప్రేమ, సామరస్యం లాంటివి పెరుగుతాయి. ఇంట్లో భార్యభర్తల మధ్య అన్యోన్యం పెరిగి కలహాలు దరి చేరవు. ఇంట్లో మనస్పర్థలు, విబేధాలు, కలతలు తగ్గుతున్నాయంటే దాని అర్థం లక్ష్మీ దేవి మిమ్మల్ని ఆశీర్వదించి మీ ఇంటికి వచ్చిందని అర్థం చేసుకోవచ్చు.