ఈ రాశి వారిని పెళ్ళిచేసుకుంటే...మీ జీవితం ఆనందమయం

VAMSI
పెళ్లి అంటే ఆడవారైనా.. మగవారైనా ఇద్దరి జీవితంలో అది ఒక పెద్ద పండుగలాంటిదని చెప్పొచ్చు. చాలా మంది తమ వివాహం గురించి ఎన్నో కలల్ని కంటారు. కొంతమందైతే చిన్నప్పుడే బొమ్మల పెళ్లి చేసే సమయంలో, భవిష్యత్తులో తమకు కాబోయే పెళ్లిలో తమకు కావాల్సిన భాగస్వామి ఎలా ఉండాలో ఊహించుకుంటారు. అయితే ప్రస్తుతం చాలా మంది పెళ్లిళ్లు ఎంత వేగంగా చేసుకుంటున్నారో.. అంతే వేగంగా విడిపోతున్నారు.. దీనికి ప్రధాన కారణం తగాదాలు.. చిన్న చిన్న విషయాలకే గొడవ పడటం. అయితే మీ విషయంలో ఇలా జరగకుండా ఉండాలంటే మీరు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని వివరాలను తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ బంధం అయినా తగాదాలు అనేవి చాలా కామన్. మీ జాతకం బట్టి మీరు కొన్ని రాశుల వారితో మీ జీవితాన్ని పంచుకుంటే మీ లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది. అయితే ఆ రాశిచక్రాలేవో.. ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే ఎలాంటి తగాదాలు లేకుండా, మీ జీవితం సంతోషకరంగా సాగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...
కన్య రాశి వారికి వివాహం విషయంలో తప్పు అనేది దాదాపు జరగకపోవచ్చు. ఎందుకంటే వీరు ప్రతి ఒక్క విషయాన్నీ చాలా లోతుగా, శ్రద్ధగా పరిశీలించి, అధ్యయనం చేసి నిర్ణయాలను తీసుకుంటారు. ఇక ప్రేమకు సంబంధించిన విషయాల్లో అయితే కచ్చితంగా ఆబ్జెక్టివ్ గా ఉంటారు. అయితే, వారు సంబంధంలో ఉండే సమస్యలను చాలా సహనంతో ఎదుర్కొంటారు. వారిలో ఉన్న ఆకర్షణకు ఇది కూడా ఒక కారణం కావచ్చు. కర్కాటక రాశి వారు చాలా సెన్సిబుల్ గా ఉంటారు. వీరికి భావోద్వేగాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు మనసుకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. వీరు సందర్భాన్ని బట్టి ఎలా ప్రవర్తించాలో తెలుసుకుంటారు. ఇక రిలేషన్ షిప్ విషయంలో ఏదైనా సమస్య వస్తే దాని యొక్క మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడి నుండి ఒక పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు.
మకరరాశి వారు లైఫ్ లో చాలా విషయాల్లో ఎక్కువగా ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు. అందుకే వీరికి ఎంత కష్టమైన పరిస్థితులు ఎదురైనా, అలాంటి వాటిని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు. వీరి ఆలోచనా ధోరణి చాలా భిన్నంగా ఉంటుంది. వీరు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు. ఇతరులను వీరి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి అవకాశం ఇవ్వరు. ఇక రిలేషన్ షిప్ విషయానికొస్తే, ఎంతో అనుభవం ఉన్న వారిలా డీల్ చేస్తుంటారు. వీరు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడంలో చాలా ప్రావీణ్యం కలవారు. కుంభరాశి వారికి మేధాశక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా విషయాల్లో తెలివిగా వ్యవహరిస్తారు. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు చాలా చమత్కారంగా మాట్లాడతారు. అదే సమయంలో రిలేషన్ షిప్ లో ఉండే ఎమోషన్స్ వంటి విషయంలో వారు ఎంతో నిజాయితీతో, పరిపక్వతతో వ్యవహరిస్తారు. వీరు ఎవ్వరి విషయంలో అనవసరంగా వేలు పెట్టరు.
తులారాశి వారు ఎల్లప్పుడూ బ్యాలెన్స్ గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా రిలేషన్ షిప్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటారు. వీరి భాగస్వామితో బంధం ఎంత బలంగా.. సన్నిహితంగా ఉన్నా.. ఎక్కువ అతివిశ్వాసం, అహంకారం వంటివి ప్రదర్శించరు. మరో విశేషమేమిటంటే.. వీరు తమ భాగస్వామిని చాలా బాగా అర్థం చేసుకుంటారు. వృషభ రాశి  వారు ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక రిలేషన్ షిప్ విషయంలో అయితే ప్రాక్టికల్ గా కనిపించినప్పటికీ.. అర్థం చేసుకునే మైండ్ సెట్ వీరికి ఉండదు. అయితే బంధాలు..అనుబంధాల విషయంలో వీరు చాలా సెన్సిబుల్ గా ఉంటారు. వీరు మైండ్ లో అనుకున్న దాని కంటే ప్రాక్టికల్ గా పరిస్థితులను మరింత బాగా హ్యాండిల్ చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: