అహంకారం...మనిషి సర్వనాశనానికి మూలం...!
మనకూ కొన్ని అధికారాలు, శక్తులు ఉన్నాయని చూపించకపోతే నిత్య జీవితము సజావుగా సాగదు. నింద, నిరాకరణ వంటి ఆయుధాలను ఉపయోగించవలసి వస్తుంది. పిల్లలకు, భార్యకు, తోటివారికి, మాక్రిందివారికి భయపెట్టడానికి గదమాయించి అధికారంతో మాట్లాడవలసి వస్తుంది. ఎదుటి వారి భాషాదాడిని ప్రవర్తనను ఎప్పటిప్పుడు గమనిస్తూ దానిని అడ్డుకోవాలంటే మేము అధికులము అన్నది చూపించవలసి వస్తుంది. ఇవన్నీ చూస్తూ కూడా సాధువులా ఉంటే మిమ్మల్ని పిరికివాడిలా, బలహీనుడిగా జమ కడ్తారు. మరి గర్వము, అధికారము లేకుండా ఉండటము వీలవుతుందా? ఇవి రెండూ ఉంటే చెడుగా ఉన్నట్లా?” అని ప్రశ్నిస్తారు.
నా మిత్రుడు ఒకడు ఇలా చెప్పాడు, ” మాతో రోజూ జరిగేది ఇదే. మాపై అధికారులు లేక మా పెద్దవారు ఆ పెద్ద అధికారాన్ని చూపిస్తారు. అది మాకు నచ్చదు ఎందుకంటే బహుశా అది మా అహంను దెబ్బతీస్తుంది కాబట్టి మాకంటూ ఒక గౌరవము ఉంది. దాన్ని అధికార దర్పంతో పాడు చేస్తే మాకు నచ్చదు. ఎవరైనా మమ్మల్ని అతిగా భయపెడితే మేము అస్సలు సౌమ్యంగా ఉండేదే లేదు. ఇలాంటప్పుడు మేము ఏమి చెయ్యాలి?” అత్యంత ఓపికగా ఉండాలి, ఉన్నదానితో సంతృప్తి చెందాలి, లేని దాని కోసం వృధా ప్రయాస పడకూడదు. పెద్దలయందు గౌరవము కలిగి ఉండాలి. ఇవే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి.