కాకులకు మాత్రమే పిండాన్ని ఆహారంగా ఎందుకు పెడతారు...?

VAMSI
మనదేశం బహుళ మతాలు కులాలు ఉన్నది. కాబట్టి మన దేశాన్ని సంప్రదాయ దేశంగా ప్రపంచంలోని అన్ని దేశాలు గౌరవిస్తాయి. ఈ ఆచారాలన్నింటికీ శాస్త్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాకుండా వీటికి సరి అయిన కారణాలు కూడా చెప్పబడి ఉన్నాయి.  ఇటువంటి ఆచారాలు పద్ధతులు పాటించడం వలన మనకు ఎన్నో ఉపయోగాలు కూడా ఉంటాయి. ఇది చాలా సార్లు రుజువు అయింది కూడా. మామూలుగా ఇంట్లో ఎవరైనా చనిపోతే , సంప్రదాయ బద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. ఇందులో పెద్దవారికి చాల ముఖ్యమైంది పిండం పెట్టడం.  

ఈ పిండ ప్రధానము కూడా కేవలం కాకులకు మాత్రమే పెట్టడం మన సంప్రదాయం. కానీ కాకులంటే చెడు శకునమని, కాకి తంతే చెడు జరుగుతుందని చాలామంది నమ్ముతుంటారు... అలాగే నడుచుకుంటారు కూడా, అయితే కాకి వారి ఇంటి గోడపై వాలి అరిస్తే..వారింటికి బంధువులు వస్తారని అనుకుంటూ ఉంటారు.... ఇలా కాకుల గురించి కొంతమంది ఉన్నదీ, లేనిదీ వారికి అనిపించిన విధంగా ఊహించుకుంటారు. అయితే ఎందుకు కాకులకు పిండ ప్రధానము చేస్తారో తెలుసుకుందాము.

ఎందుకంటే చనిపోయిన వారి ఆత్మలు కాకులలో ఉంటాయని నమ్మడం ప్రధాన కారణం .. అందుకే ఎవరైనా చనిపోయిన పదిహేను రోజుల లోపు వారి ఇంటి దగ్గరకు  వస్తే..ఇది వారి ఆత్మే అని బలంగా నమ్ముతారు...అందుకే వారికి అన్నం పెడతారు...కాకులు ఎలాగూ పెట్టిన అన్నాన్ని తింటాయి...ఒకవేళ కాకులు పెట్టిన అన్నాన్ని తినలేదనుకోండి....వారి ఆత్మలు సంతోషంగా లేవని, వారికేదో కోరికలు ఉన్నాయని నమ్ముతుంటారు. దీనికి సరైన ఆధారాలు అయితే ఎక్కడా లేవు...ఇది ఒక ఆచారంగా పాటిస్తూ వస్తున్నారు. దీనికి ఇంకో కారణం కూడా ఉంది...పూర్వం యముడు నరకంలో బాధలను అనుభవించే వారికి ఒక వరం ఇచ్చాడు...కాకులు ఎవరి పిండం అయితే తింటాయో వారికీ విముక్తి కలుగుతుందని, ఇక అప్పటినుండి ఈ ఆచారం కొనసాగుతూ ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: