ఉపకారం వెనుక ఉన్న పరమార్ధం ఏమిటో తెలుసా...?

VAMSI
జీవితం తాత్కాలికమైనది ఇది తెలియక జనులంతా లేని మరియు రాణి దాని కోసం వెంపర్లాడుతూ ఉంటారు. ఈ విధి అదే వింత నాటకంలో మనిషి నెవడు ఒక పాత్ర ధారుడే తప్ప, సూత్ర ధారుడు ఎన్నటికీ కాలేడు.  మనకున్న ఈ చిన్న జీవితంలో ఇతరులకు మనకు తోచినంత సహాయం చేయడం ఉత్తమం అనిపించుకుంటుంది. ఇలా చేసిన ఉపకారం సాక్ష్యాత్తు దేవునికి చేసిన పూజ కన్నా ఎక్కువని శాస్త్రాలు చెబుతున్నాయి. పూర్వం పెద్దవారు హెప్పినట్లు దేవుడు ఎక్కడో ఉండడు, మనము చేసే మంచి పనుల రూపంలో నీలోనూ నాలోనూ ఉంటాడు అని, ఇది అక్షర సత్యం. మనము ఎవరియాకినా సహాయం చేస్తే వాళ్ళు కూడా, " దేవుడిలా వచ్చి ఆదుకున్నారయ్యా అంటారు..దీనికి ఇదే నిదర్శనం.

పుట్టడం మన చేతుల్లో ఉండదు, అలాగే చావడం అనేది మన చేతుల్లో ఉండదు...ఈ నడుమదంతా ఆ దేవుడి ఆడించే నాటకం.. మనము చేసే ప్రతి క్రియకు మనమే బాధ్యులం. సన్యాసి అంటాడు...‘ఈ రోజు నా వల్ల ఈ లోకానికి ఏం ప్రయోజనం కలిగింది?’ అని, అదే విధంగా  సంసారి అనుకుంటాడు ‘ఈ రోజు లోకం వల్ల నాకేం లాభం కలిగింది అని.ఈ రెండు వ్యాఖ్యలలో ఎంత పరమార్ధము ఉందొ మీరే ఆలోచించండి. ...ఇది సహజం, తనకు మాలిన ధర్మం పనికి రాదు అనుకోవడంలో తప్పులేదు. ‘అంతా నాకే కావాలి’ అని అనుకోవడంలోనే ఇబ్బందులు వస్తున్నాయి. పూర్వం ‘నీది నీదే, నాదీ నీదే’ అనేవారు తపోధనులు. ఆ తరవాత ‘నీది నీదే, నాది నాదే’ అనే కాలం వచ్చింది. ఇది కొంత వరకు ఫరవాలేదు. ‘బతుకు - బతకనివ్వు’ అన్న సిద్ధాంతమన్నమాట.

పూర్వం అయితే ఒక మనిషి వారింటికి అతిధిగా వస్తే, ముందుగా వచ్చిన అతిథికి అన్ని సపర్యలు చేసి...భోజనం పెట్టిన తరువాతనే వీరు బోంచేసేవారు...అంతటి మహాభాగ్యంగా అతిధిని చూసుకునేవారు. కానీ ఇప్పటి పరిస్థితి అలా లేదు. వచ్చిన అతిధి ఎన్ని రోజులు ఉంటాడో, ఏమి చేసి పెట్టాలో, అని రక రకాల లెక్కలు వేసుకుని బ్రతుకుతున్నారు. అయితే ఇవాళ అదికూడా పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా తిండి కోసం వచ్చే అతిధుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. జీవితంలో మనిషి సేవ చేయడానికి అనేక మార్గాలున్నాయి. తిండి, బట్ట, ఇల్లు లేనివాళ్లు ఎందరో ఉన్నారు. వారికి సహాయం చేయడం వలన మీకు భగవంతుడు మంచి చేస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: