సాయిబాబాకు ఏ నైవేద్యం పెట్టాలో తెలుసా...?

VAMSI
హిందువులు ముస్లిములు ఇరువురు కొలిచే దైవం సాయిబాబా. సాయిబాబా అసలు పేరు, జన్మ స్థలం ఎవరికీ తెలియదు. అప్పటి ప్రజలకు సాయిబాబా ఒక సాధువుగా మాత్రమే తెలుసు. సాయిబాబా జీవిత నడవడిలో, బోధనలలో హిందూ మరియు ముస్లిం రెండు మతాలను అవలంబించారు. సాయిబాబా మసీదులో నివసించారు, గుడిలో సమాధి అయ్యారు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో ఉపయోగించారు. ఈయన రెండు సంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించేవారు.

ఈయన తరచూ పలికే వాక్యము అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్ (అందరికి ప్రభువు ఒక్కడే). కొంతమంది భక్తులు (ప్రధానంగా హిందూ సంప్రదాయానికి చెందినవారు) సాయిబాబాను శివుని, దత్తాత్రేయుని అవతారం అయిన సద్గురువుగా భావిస్తారు. అందుకే  ఈయనను సద్గురు సాయి అని కూడా అంటారు. భారతదేశంలో దాదాపు అన్ని ముఖ్య నగరాలలోను, చాలా పట్టణాలలోను సాయిబాబా మందిరాలున్నాయి. కొన్ని విదేశాలలో కూడా బాబా మందిరాలున్నాయి. ముంబైకు చెందిన షామారావు జయకర్ చిత్రించిన నిలువెత్తు పటం బాబా నివసించిన మసీదులో ఉంది.

సాయిబాబా రచించిన గ్రంథాలేవీ లేవు. సాయిబాబా బోధనలు మౌఖికంగానే శిష్యులకు లభించాయి.దానము, ఉన్నదానిని ఇతరులతో పంచుకోవడం... బాబా బాగా ప్రోత్సహించిన గుణాలు.. “దప్పిక గొన్నవారికి నీరు, ఆకలిగొన్నవారికి అన్నము, నగ్నంగా ఉన్నవారికి దుస్తులు ఇవ్వు, నీ వరండాలో నలుగురూ కూర్చొని విశ్రమించే అవకాశం ఇవ్వు. అలాగైతే శ్రీహరి తప్పక ప్రసన్నుడౌతాడు. ఒక వేళ దానం చేయడం ఇష్టం లేకపోతే మర్యాదగా నిరాకరించు గాని వారియెడల కుక్కలాగా మొరగవద్దు” అని చెప్పారు. హిందువులు సాయి బాబాకి ఇష్టమైన గురువారం నాడు ఆయనకు ప్రత్యేక పూజలు జరుపుతుంటారు.  ఆయనకు ఏ నైవేద్యం పెట్టాలి అని ఆలోచిస్తుంటారు. 

బాబా కు ఎలాంటి నైవేద్యం  ఇష్టం అంటే...బాబాకు పాలకూర అంటే చాలా ఇష్టమట, కావున గురువారంనాడు పాలకూర తో చేసిన వంటకాలను నైవేద్యంగా పెడితే అంతా మంచి జరుగుతుందని ఒక నమ్మకం. అలాగే సాయిబాబాకు హలో అంటే చాలా ఇష్టమట... గురువారం నాడు హల్వాను నైవేద్యంగా పెట్టడం వలన మంచి ఫలితం ఉంటుందట. కిచిడి ని కూడా బాగా ఇష్టమైన వంటకాల్లో ఒకటి అని చెబుతుంటారు. గురువారం నాడు బాబాకు ప్రీతికరమైన నైవేద్యాలను పెట్టి భక్తిశ్రద్ధలతో పూజిస్తే మన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: