గుడికి వెళ్ళాక ఇవి చేయడం తప్పనిసరి...మరిచిపోకండి...?
కానీ దేవాలయాలకు వెళ్లే ముందు కొన్ని నియమాలను తప్పక పాటించాల్సి ఉంటుంది. అప్పుడే గుడికి వెళ్ళిన సార్థకం మనకు లభిస్తుంది. ఇంతకీ ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గుడి లోపలికి ప్రవేశించే ముందు, పాదాలు శుభ్రం చేసుకుని, ఆ తర్వాత నోటిని పుక్కిలించి శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాతే లోపలికి ప్రవేశించాలి. ఇలా చేయడం వల్ల పరిపూర్ణంగా మనల్ని మనం శుద్ధి చేసుకున్నట్లు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. తల మీద టోపి కానీ, తలపాగా కానీ ధరించి దేవుడి ముందు నిలబడరాదు. ఆలయంలోకి వెళ్లాక మనసుని దేవుడిపై ఉంచాలి.
మరే ఇతర ఆలోచనలు లేకుండా నిర్మలంగా ఉండాలి. ముందుగా దేవుని చుట్టూ కనీసం మూడు సార్లు అయినా ప్రదక్షణాలు చేయాలి. గుడిలో ఉన్న నవగ్రహాల చుట్టూ కూడా ప్రదర్శనలు చేస్తే మరీ మంచిది. గుడికి వెళ్ళాక పూజ అనంతరం కాసేపు మందిరంలో కూర్చోవాలి. అక్కడే కొంత ప్రసాదాన్ని సేవించాలి. గుడి ముందు ఉన్న బిచ్చగాళ్లకు మనకు చేతనైన సహాయం చేయాలి... ఒకవేళ మీరు వెళుతున్నది సాయిబాబా గుడికి అయితే మందిరంలో హోమగుండం ఉంటుంది. అందులో ఎండిన తులసి కొమ్మను వేయడం మంచిది. ముఖ్యంగా గుడిలో ఉన్నప్పుడు ఎటువంటి దురాలోచన రాకుండా ఉండేందుకు ఆ దేవుని నిరంతర స్మరిస్తూనే ఉండాలి. ఇవన్నీ చేయడం వలన దేవుని యొక్క కరుణ కటాక్షాలను పొందుతారని చెబుతున్నారు పండితులు..