సాయి సచ్చరిత్ర పారాయణం చేసే ముందు కొన్ని నియమాలు పాటించాలి...?

kalpana
శిరిడీ సాయిబాబా గురించి అందరకు తెలిసిందే.బాబా సమాధి వద్దకు వెళ్లి ఏమి కోరుకున్నా తీరుస్తాడని భక్తుల నమ్మకం. బాబా కు సంబంధించిన రచనలు అన్నింటిలోకి సాయి  సచ్చరిత్ర చాలా గొప్పది.సాయి సచ్చరిత్ర ను పారాయణం చేయడం అంటే బాబా ఉపదేశాలు,బోధనలు, నీతుల్ని ఆకలింపు చేసుకోవడమే. అంతే కాకుండా వాటిని పాటించడం చాలా ముఖ్యం, బాబా కోరుకునేది కూడా ఇదే, నిరంతరమూ తనను పూజించడంవల్ల సప్త సముద్రాలను దాటి వచ్చి వారి కష్టాలను తీరుస్తానని బాబాయే స్వయంగా చెప్పారు.అలాంటి బాబా సాయి సచ్చరిత్రను పారాయణం చేసేటప్పుడు కచ్చితంగా ఈ నియమాలు పాటించాలి. ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

 పారాయణం మొదలు పెట్టే రోజు శుచిగా  తలస్నానం చేయాలి.

 పారాయణం చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు పారాయణానికి ఆటంకం కల్పించే వస్తువులు ఏవి దగ్గర ఉంచుకోకూడదు.(సెల్ ఫోన్, రేడియో) ఇలాంటివి దగ్గర ఉంచుకోకూడదు.

 సాయి సచ్చరిత్రను ఎవరైనా పారాయణం చేయవచ్చు.  కులమతాలు లేవు, వయో భేదం కూడా లేదు,లింగ బేధము లేదు.ఎలాంటి వారైనా సాయి సచ్చరిత్రను పారాయణం చేయవచ్చు.

 ఎక్కువ కష్టాలు, సమస్యలతో బాధపడుతున్న వాళ్లు సాయి సచ్చరిత్ర ను ఏడు రోజులు పారాయణం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

 పారాయణం ను ఉదయమే మొదలు పెట్టాలి.ప్రత్యేక సంకల్పముతో పారాయణము చేయాలనుకుంటే, ఆ వ్యక్తి పేరు పై లేదంటే సమస్యను ఉద్దేశించి ఒక్క రోజులు పారాయణ పూర్తి చేయాలి.

 బాబాకు ఇష్టమైన రోజుల్లో పారాయణం చేయడం చాలా మంచిది. బాబాకి ఇష్టమైన రోజులు గురుపౌర్ణమి,విజయదశమి, శ్రీరామనవమి,దత్త జయంతి ఈ రోజుల్లో పారాయణం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

 పారాయణం మొదలు పెట్టేముందు పాపకు నైవేద్యం సమర్పించాలి.అంతేకాకుండా మనలో ఉండే అహంకారం, అసూయాద్వేషాలు పక్కన పెట్టాలి.

 బాబా రూపాన్ని గుండెల్లో ప్రతిష్టించుకొని సచ్చరిత్ర పారాయణం చేస్తే మనం కోరిన కోరికలు నెరవేరు తాయి.

 పారాయణము చదివేది అయిపోయిన తర్వాత సచ్చరిత్రను దానం చేయాలి.వారి చేత కూడా పారాయణం చేయించడం వల్ల మంచి జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: