కర్పూరంతో మీ ఇంట సిరుల పంట...ఎలాగో మీరే తెలుసుకోండి...?

VAMSI
హిందూ ఆచారాలలో ఎన్నో పద్దతులను మనము పాటిస్తూ వస్తున్నాము. ఈ సంప్రదాయాలన్నింటిలో దేవునికి పూజ చేయడం అనేది మహా ప్రాముఖ్యమైన చర్య. దీని వలనే భగవంతుడు అమిత సంతోషుడై భక్తులకు కోరిన వరాలను ప్రసాదిస్తూ ఉంటారు. అయితే ఇటువంటి పూజా కార్యక్రమంలో మనము కర్పూరాన్ని వాడుతామని తెలిసిన విషయమే. అయితే కొందరు శక్తి కలిగిన పూజారులు మరియు శాస్త్రజ్ఞులు కర్పూరానికి మహిమలు ఉన్నాయని అంటుండేవారు. అయితే ఈ కర్పూరం వెనుక ఉండే మహిమలేమిటో అలాగే దాని వలన ఉపయోగాలేమిటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా...?

పండితుల మాట ప్రకారం మన జీవితంలో చంద్రుడు ప్రభావం వలన అనేక మార్పులు మరియు ప్రమాదాలు వస్తూ ఉంటాయి.  అలాంటి ప్రమాదాల బారి నుండి బయటపడేందుకు మనం కర్పూరం, లవంగాలను తమలపాకుల్లో చుట్టి.. కాళికామాత ముందు ఉంచాలి. ఎంతో మంది సరి అయిన సమయంలో వివాహాలు కాకుండా ఇబ్బంది పడుతూ వుంటారు. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు వీరంతా గ్రహాల ప్రభావం అనుకుని జ్యోతిష పండితుల దగ్గరకు వెళ్లడం చేస్తుంటారు. కానీ ఇలా వెళ్లడం వలన ఎటువంటి ఉపయోగం ఉండబోదు.

దీనికి ఒకటే పరిష్కార మార్గం...పసుపు మరియు కర్పూరాన్ని కలిపి దుర్గామాతను పూజిస్తే వివాహ సంబంధ సమస్యలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అంతే కాకుండా ఆర్ధిక సమస్యలతో సతమతమయ్యేవారు వీధికి బోలెడు మంది ఉంటారు. దీనికి వారంతా సంతోషంగా ఫీలయ్యే ఒక విధానం ఉంది. కర్పూరంలో లవంగాలు వేసి కాల్చాలి. తర్వాత వాటిని నిద్రపోయే ముందు బయట పారేయాలి. ఇక ఆ తర్వాత డబ్బు సమస్యలే ఉండవని పండితులు చెబుతున్నారు. ఇటువంటి మహత్తరమైన కర్పూరాన్ని ఇంకా అనేక విధాలుగా ఉపయోగిస్తూ ఉంటారు.

ఉద్యోగాలు రాకపోయినా, సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటున్నా... అన్నింటికీ కర్పూరం వాడుతారు. అందుకే పూజల్లో కర్పూరంతో హారతి ఇస్తారు. కర్పూరానికి నెగెటివ్ ఎనర్జీని తరిమేసే శక్తి ఉందని బలంగా నమ్ముతారు. అందువల్ల కర్పూరంతో పూజలు చేస్తే అంతా మేలే జరుగుతుందని చెబుతున్నారు. కాబట్టి మీరు కూడా పై సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా అయితే వెంటనే పైన చెప్పిన విధంగా చేసి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: