శివుడి దగ్గర శంఖాన్ని ఎందుకు పెట్టరో తెలుసా...?

VAMSI
అనాదిగా వస్తున్న హిందూ మత ఆచార వ్యవహారాలు మరియు పురాణ శాస్త్రాలు చెబుతున్న దాని ప్రకారం శంఖం చాలా మంచిది. ఇంట్లో ఉన్నప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలన్న, వారికీ శుభం జరగాలన్న దీనిని ఇంట్లో పూజ గదిలో ఉంచుకోవడం ఎంతో ప్రధానమని చెబుతున్నారు. అయితే దీని వలన శుభాలు జరుగుతాయని మాత్రం ఎవరు ఆడితే వారు దీనిని కొనడానికి వీలు లేదు. ఒకవేళ కొంటే కనుక శంఖాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. శంఖం అంటే సాక్ష్యాత్తు విష్ణుమూర్తికి చెందినదని భావిస్తాము. శంఖం పట్ల నిర్లక్ష్యంగా ఉంటే... స్వామి పట్ల కూడా నిర్లక్ష్యంగా ఉన్నట్లే అవుతుందని హెచ్చరిస్తున్నారు.
ఇటువంటి మహత్తరమైన శంఖాన్ని ఇష్టం వచ్చినట్లు వదిలేస్తే, ఆఇంటిలో వారికి మంచి జరగకపోగా... నెగెటివ్ ఎనర్జీ ప్రవేశించి... చెడు జరుగుతుందని హెచ్చరిస్తున్నారు పండితులు. ఒకవేళ మీరు శంఖాన్ని కొనాలనుకుంటే ఒకేసారి రెండు శాఖలను కొనాలని పండితులు సూచిస్తున్నారు. కానీ ఈ రెండింటినీ ఊదడానికి ఉపయోగించకూడదు. ఒక శంఖాన్ని మాత్రమే ఊదడానికి ఉపయోగించాలి. మిగిలిన ఇంకొక శంఖాన్ని పూజ కోసం వాడాలి. ఏ శంఖాన్ని అయితే మనము పూజ కోసం ఎంచుకున్నామో దానిని నీటి శంఖం అంటారు. ఎప్పుడూ కూడా ఈ రెండు శాఖలను ఒకేచోట ఉంచకూడదు.
శంఖంతో మనకు ప్రతి రోజూ పని ఉండకపోయినా వాటిని భద్రపరిచే విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. శంఖాన్ని ఎరుపు లేదా బంగారు రంగు వస్త్రానికి చుట్టి ఉంచవలెను. పూజ చేసే ముందు ఈ శంఖాన్ని గంగా జలంతో శుభ్రపరచవలెను. నీటి శంఖాన్ని విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉంచవచ్చు. నీటి శంఖంలో ఎప్పుడూ నీరు ఉండేలా చూసుకోవాలి. దాన్ని ఓ పవిత్ర వస్త్రంలో చుట్టి ఉంచాలని పండితులు సూచిస్తున్నారు. మీరు ఇంకో విషయం గుర్తించుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ శంఖాన్ని శివుడు దగ్గర ఉంచకూడదు. ఓవేళ లా ఉంచితే మీరు అధిక కష్టాలకు లోనవుతారు. మీ ఇంటిలో ఎప్పుడూ కష్టాలతో ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: