శివుడికి నిజంగా మూడో కన్ను ఉందా...?

VAMSI
సృష్టిని అంతటినీ సృజించింది భగవంతుడు. అయితే హిందూ ఆచారాలలో మనకు ఎంతో మంది దేవుళ్ళు మరియు దేవతలు ఉన్నారు. ఎవ్వరికీ మూడు కళ్ళు లేనిదీ, ఒక్క శివుడికి ఎందుకు ఉన్నాయి. మరి శివుడిని ఎందుకు ముక్కంటి అని పిలుస్తారు ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు మీ మనస్సులో ఉంటాయి. దానికి కారణం ఏమిటో ...ఇప్పుడు తెలుసుకుందామా...? పండితులు చెబుతున్న ప్రకారం...శివుడికి ఉన్న మూడో కన్ను ద్వారా భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని, అంతే కాకుండా ప్రతి మనిషికి ఇది జ్ఞానాన్ని అందిస్తుందని చెబుతున్నారు. ఏ నేత్రాన్నే మనో నేత్రం అని కూడా అంటారు. ప్రతి మనిషిలోని జ్ఞానజ్యోతి వెలుగుతూనే ఉంటుంది. ఆ వెలుగును దర్శించుకోగలిగిన వారు మహాపురుషులు అవుతారు.
ఒక్కోసారి మనకు రెండు కళ్ళు ఉన్నప్పటికీ న్యాయమేదో అన్యాయమేదో తెలుసుకోలేము... అందుకే న్యాయస్థానాల్లో న్యాయదేవతకు కళ్ళు కట్టి మనో నేత్రంతో నిజాన్ని చూసి తీర్పును ఇస్తుంటారు న్యాయనిర్ణేతలు.  ఒకానొక సందర్భంలో మన్మధుడు వచ్చి శివుడిని ప్రేరేపించినప్పటికీ, కోపోద్రిక్తుడైన శివుడి ఆ మనో నేత్రంతో మన్మధుడిని భస్మం చేశాడు. అంటే తన కున్న నేత్రంతో కామ వాంఛను జయించాడని  అర్ధం చేసుకోవచ్చు. అందుకే మనలోనూ మూడో నేత్రం ఉండాలంటున్నాడు శివుడు. ప్రతి సామాన్య మానవుడికి సమతుల్యత, సాధుత్వం, దూరదష్టి ఉండాలి. పరస్త్రీని తల్లిగా భావించాలి, ఇతరుల ధనం కోసం ఆశపడకూడదు, సన్మార్గంలో యశస్పు గడించాలి.
మనిషిలో మూడో నేత్రం తెరుచుకున్నప్పుడు కంటికి కనిపించే వస్తువులు కాకుండా, పోతన చెప్పినట్లు పెను చీకటికి ఆవల ఉన్న పరమాత్మను దర్శించగలుగుతారని యోగీశ్వరులు చెబుతారు. శివుడు తపస్సులో నిమగ్నమై ఉన్నప్పుడు, పార్వతీ దేవి వచ్చి సరదాగా శివుడి రెండు కళ్లను తన చేతులతో మూసి వేసింది.  అప్పుడు ప్రపంచమంతా చీకటిగా మారింది. స్వర్గాధిపతి కూడా భయపడిపోయాడు. ఆ క్షణంలో శివుడు తనకున్న దివ్య శక్తితో మూడో కనువును సృష్టించి తన నుదుటి మీద నిలిపాడు. ఆ కంటి నుండి నిప్పులు రాలి లోకానికి మళ్ళీ వెలిగిచింది. ఆ విదంగా శివుడు ముక్కంటి అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: