హిందూ సంప్రదాయంలో సూర్యడు, విష్ణువు, శివుడు, గణపతి, దేవీ ఈ అయిదుగురు దేవతలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఒక్కొక్క పంచాయతన పూజలో వీరి అమరిక ఒక్కొక్క విధముగా ఉంటుంది. ఈశాన్యములో విష్ణువు, ఆగ్నేయంలో గణపతి, వాయువ్యంలో దేవీ, నైరుతిలో శివుడు, మధ్యలో సూర్యుడున్నట్లయితే ఈ అమరికను ‘ సూర్య పంచాయతనము’ అంటారు. ఈశాన్యంలో విష్ణువు, ఆగ్నేయంలో సూర్యడు, వాయువ్యంలో దేవీ, నైరుతిలో గణపతి, మధ్యలో శివుడును అమర్చినట్లయితే దానిని ‘శివ పంచాయతనము’ అంటారు.
ఈశాన్యంలో విష్ణువు, ఆగ్నేయంలో శివుడు, వాయువ్యంలో దేవీ, నైరుతిలో సూర్యుడు, మధ్యలో గణపతి ఉన్నట్లయితే ఈ అమరికను ‘ గణేశ పంచాయతనము’ అంటారు. ఈశ్యానములో విష్ణువు ఆగ్నేయములో శివుడు, వాయువ్యంలో సూర్యుడు, నైరుతిలో గణపతి, మధ్యలో దేవీ ఉన్నట్లయితే దానిని ‘ దేవీ పంచాయతనము’ అంటారు.
మరింత సమాచారం తెలుసుకోండి: