గౌతమ బుద్దుడు చెప్పిన ఈ విషయాలు తెలుసుకోండి...?

VAMSI
ఈ సృష్టిలో ఎంతోమంది మహానుభావులు సిద్దులు, యోగులు మరియు బాబాలు, మనుషుల యొక్క జీవన విధానాన్ని వారు అనుసరించ వలసిన పద్దతులను కూలంకుషంగా వివరించడం జరిగింది. ఇందులో ఎవరి ప్రత్యేకత వారిదే. అంధుల ఒకరు గౌతమ బుద్ధుడు. ఈయన వల్లించిన బోధనలు అని కాలాలకు సంబంధించినవిగా ఉంటాయి.  బుద్ధుని బోధనలు ఎలాగైతే మనిషిని ప్రభావితం చేస్తాయో అదే విధంగా బుద్ధుని జీవితం నుండి కూడా మనం ఎన్నో  నేర్చుకోవచ్చు. ఈయన పేరులోనే ఇతని గొప్పతనం ఉంది. ఇతని పేరుకు అర్ధం జ్ఞానోదయం పొందిన వ్యక్తి.  అప్పట్లో గౌతమ బుద్ధుడు చెప్పిన కొన్ని విషయాలు రాజులకు జీవనచక్రం స్వేచ్ఛనిచ్చాయి. అయితే ఈ విషయాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాము.

ఈయన ఇంతగా తన జీవితంలో విజయవంతం కావడానికి ఏకైక కారణం ప్రతి ఒక్కరూ తమ కోసం ఒక మార్గాన్ని ఏర్పరుచుకోమని చెప్పడమే...దేనికి కోసం బుద్ధుడు కొన్ని దశలను అనుసరించాడు. గౌతమ బుద్ధుడు ఒక రాజ కుటుంబంలో యువరాజుగా జన్మించాడు. తన జీవితాన్ని పుట్టినప్పటినుండి పెద్దయ్యే వరకూ ప్యాలస్ లో ఎంతో వైభవంగా గడిపాడు. కానీ చివరికి సన్యాసంతో ఆనందాన్ని వెతుకున్నాడు. తన రాజ్యాన్ని సైతం ఇతరులకు వదిలేసిన మహానుభావుడు. ఆఖరికి చివరి వరకూ కూడా జ్ఞానానికి మార్గం కోసమే వెతుకుతూ ఉన్నాడు. ప్రపంచంలో ఉన్న అచలామంది గురువుల లాగానే, గౌతమ బుద్ధుడు కూడా ఎన్నో ప్రదేశాలకు వెళ్లి అక్కడి ప్రజలతో సత్సబంధాలను ఏర్పరుచుకునే వాడు. జ్ఞానాన్ని పంచుకోవడంలో ఆయనకు అందరికంటే కాస్త ఎక్కువగానే నమ్మకం ఉంది.

కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానాన్ని పంచుకోవడంలో ముందుండాలి. ఎందుకంటే మనము జ్ఞానాన్ని ఎంత పంచుకుంటే మనకు అంత పెరుగుతుంది. సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నమే ఉత్తమమైన మార్గమని చెప్పాడు. కాబట్టి సత్యాన్ని కొనకండి కనుక్కోండి. సంపదతో అన్నీ కొనడానికి సాధ్యం కావు. కాబట్టి సంపద కన్నా గొప్పతనమే ముఖ్యమని తెలుసుకోండి. మన లక్ష్యాలను చేరుకోవడానికి మనం ఓపికగా, నిశ్చయంగా ఉండాలి. మన కోసం మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి సహనం చాలా అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: