శ్రీ ప్లవ నామ సంవత్సరం.. ఉగాది శుభాకాంక్షలు..!
ఏప్రిల్ 13న ఉగాది నాడు శార్వరి నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి, శ్రీ ప్లవ నామ సంవత్సరానికి ఆహ్వానం పలికే రోజు ఈ రోజు. పురాణం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే ఈ సృష్టి ఆరంభమైందని, ఆ రోజున మనం ఉగాదిగా జరుపుకుంటున్నాం. అయితే మన తెలుగు వారికి ఉగాది పండుగ నుంచే నూతన సంవత్సరం మొదలవుతుంది . కొత్త పనులు ప్రారంభించేందుకు ఉగాది చాలా మంచి రోజు అని అంటుంటారు. ఈ రోజునే బ్రహ్మదేవుడు ఒక కల్పం ప్రణయంతో అంతమై తిరిగి కొత్త కల్పనతో సృష్టిని ప్రారంభించాడని చెబుతారు.
ఉగాది అన్న తెలుగు మాట..' యుగాది ' సంస్కృతం మాట.. ఉగాది పండుగ ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేస్తున్న పండుగ ఇది. అందరి గుండెల్లో ఆనంద క్షణాలు నింపే సంప్రదాయం మనది. కష్ట సుఖాలను జీవితంలో చవి చూడాలి. మాధుర్యాన్ని కూడా రుచి చూడాలి. అదే ఉగాదిపచ్చడి తెలియజెప్పే నిజం. శ్రీ ఫ్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
జీవితం సకల అనుభూతుల మిశ్రమం. స్థిత ప్రజ్ఞత అలవరచుకోవడం వివేకి లక్షణం. అదే ఉగాది తెలిపే సందేశం. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
లేత మామిడి ఆకు తోరణాలు, శ్రావ్యమైన సన్నాయి రాగాలు, అందమైన ముగ్గులతో వీధి వాకిళ్లు, కొత్త బట్టలతో పిల్లా పాపలు ఇది ఉగాది పండుగ సంబరాలు. అందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
తిమిరాన్ని పారదోలే ఉషోదయంలా, చిగురాకుల ఊయలలో నవరాగాల కోయిలలా, మాలోగిళ్ళలో కి అడుగుపెడుతున్న ఉగాదికి స్వాగతం. అందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
ప్రపంచంలో కరోనా చీకట్లను తొలగించి, తిరిగి మంచి రోజులు రావాలని కోరుకుంటూ మీ అందరికీ శ్రీ రామ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.ఆనందం మీ సొంతం అవుతుంది.ఆహ్లాద మీ ముఖాల్లో వెల్లివిరుస్తుంది
తీపి,చేదూ కలిసిందే జీవితం.. కష్టం,సుఖం తెలిసిందే జీవితం. ఆ జీవితంలో ఆనందోత్సవాలని పూజించేందుకు వస్తోంది ఉగాది. మిత్రులందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. అందుకే ఉగాదికి షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడిని ప్రసాదంగా సమర్పిస్తారు. షడ్రుచుల లో తీపి, పులుపు, కారం,ఉప్పు, వగరు, చేదు ఎలా ఉంటాయో మన జీవితంలో కూడా అన్ని కష్టాలు నష్టాలు సుఖసంతోషాలు కూడా ఉంటాయి. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోమని చెప్పే పండుగ ఉగాది..