పండుగ రోజున పూజా విధానం...?

VAMSI
హిందువులకు దేవుళ్ళ పై అపారమైన నమ్మకం. ఈ లోకాన్ని సృష్టించిన దేవతా మూర్తులు మానవుల యొక్క ప్రతి చర్యని గమనిస్తుంటారని..వారి కర్మలకు తగ్గ ప్రతిఫలాన్ని ఇస్తుంటారని విశ్వసిస్తారు. ముఖ్యంగా మన భారత దేశంలో దేవుళ్ళ పై, మన సంస్కృతి సంప్రదాయాలపై అపారమైన నమ్మకం ఉంది. అందులో భాగంగానే వారు నమ్మి కొలిచే దేవుళ్ళకు నిత్యం పూజలు చేస్తుంటారు. ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం. ఒకప్పట్లో సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రపరచి పూజ కార్యక్రమం పూర్తి చేసేవారు. అయితే కాల క్రమేణా మానవుల జీవన శైలి మారడంతో ఇందులో కాస్త మార్పులు జరిగాయి. కానీ వాస్తవానికి సమయం మారింది కానీ ఇప్పటికి ఎక్కువ మంది ప్రజలు ప్రతి రోజు వారి ఇష్ట దైవాలకు పూజలు చేస్తున్నారు.

అయితే చాలా మందికి నిత్యం చేసే పూజ విధానంపై కొంత సందేహం ఉంటుంది. ప్రత్యేక రోజులలో, అంటే పండుగ సమయాలలో అయితే పూజ విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే నిత్యం చేసే పూజ విధానం ఖచ్చితంగా ఎలా చేయాలి అన్న దానిపై స్పష్టత ఉండక పోవచ్చు. అలాంటి వారికి ఇందులో నిత్య పూజ విధాన పద్ధతి గురించి వివరించడం జరిగింది. నిత్య పూజకు ఎలా సిద్ధమవ్వాలో ఇపుడు తెలుసుకుందాం. ముందుగా ఇంటిని శుభ్ర పరుచుకోవాలి. ఇంట్లో ఏ మూల కూడా చెత్తను నిలువ ఉంచరాదు. ఆ తరువాత శుచిగా స్నానం చేసి శుభ్రమైన ఉతికిన దుస్తులు ధరించి నుదుటున కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అనంతరం పూజ గదిని శుభ్ర పరుచుకొని, నిత్య పూజ సామాగ్రిని సుద్ధి చేసుకోవాలి.

 ఆ తరువాత పూజ గదిలో చక్కగా ఆసనం వేసుకుని కూర్చుని ముందుగా దీపారాధన చెయ్యాలి. కడ్డీలు వెలిగించాలి. ముందు వినాయకుని మంత్రం జపించాలి. తదుపరి ఇష్ట దైవానికి సంబంధించిన మంత్రం కానీ, శ్లోకం కానీ జపించాలి, లేదా ప్రేమ ప్రదాయ నమహా అన్న మంత్రాన్ని స్తుతించాలి. తరువాత కర్పూరం వెలింగించి దేవునికి హారతి పట్టి, నమస్కరించుకోవాలి. చివరగా మన ఇష్ట దైవం నామం మరోసారి జపించి, అంటే ఉదాహరణకు సాయిబాబా అయితే..ఓం సాయి రామ్ అని, వినాయకుడు అయితే జై గణేశా అని అనమాట. అనంతరం పూజను ముగించాలి. ఇలా నిత్యం చేసే పూజను ఇలా ఈ పద్ధతిలో ఆచరించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: