శ్రీరాముడిని ఆదర్శ పురుషుడని ఎందుకు పిలుస్తారో తెలుసా...?

VAMSI
మనకు ఉన్న యుగాలలో త్రేతాయుగం కూడా ఒకటి. ఈ యుగంలో శ్రీమహావిష్ణువే లోక కల్యాణం కోసం రాముడిగా అవతరించి, దుష్ట శిక్షణ చేశాడని రామాయణం అనే గ్రంధంలో తెలుపబడి ఉంది. శ్రీరాముడు గురించి మనము ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. ఆ మహానుభావుడి చరిత్ర విన్న వారికి కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది. తన జీవితం కాలంలో ఎప్పుడూ కూడా తండ్రి మాటను కాదని చెప్పిన సందర్భం ఒక్కటి కూడా లేదు. ఇతను చేసిన ఎన్నో మంచి పనులు...తనకు ఉన్న సద్గుణాల వలన అందరిచేత ఆదర్శ పురుషుడిగా కొనియాడబడ్డాడు. ఆఖరికి తాను చేయని తప్పుకు శిక్ష వేసిన తండ్రి మాటను గౌరవించి అడవులకు వెళ్ళాడు. తనకు ఉన్న సోదరులను ప్రేమించినంతగా ఈ లోకంలో మరే అన్న ప్రేమించాడేమో.
సీతాదేవి దూరమైన నిరంతరం అమె కోసం పరితపించే భర్తగా, ప్రజల సంక్షేమం కోసమే వారి మాటకు విలువిచ్చిన రాజుగా ఎక్కడా ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలని చూపించినవాడు శ్రీరాముడు. ధర్మానికి ఒక నిలువెత్తు నిదర్శనం శ్రీరామచంద్రుడు.  ఈ రామాయణంలో రాముడి కి ఉన్న లక్షణాలు గురించి చెబుతూ షోడశ మహాగుణలు ఉన్నట్లు వర్ణించబడింది. కానీ వీరితో పాటుగా సీతాదేవి, లక్ష్మణుడు ,మరియు హనుమంతుడికి కూడా కొన్ని ప్రతేయక గుణాలు ఉన్నాయి. సీతాదేవి పతివ్రతా ధర్మానికి ప్రతీకగా నిలిచింది. తన భర్త తనను అనుమానించినా, తన పాతివ్రతాన్ని నిరూపించుకునేందుకు భూస్థాపితం అయింది. ఇప్పటికీ మన భారతదేశహములో స్త్రీ అంటే సీతాదేవితోనే పోలుస్తారు. అంతటి మహాసాధ్వి. లక్ష్మణుడు అన్న మరియు వదినలు కోసం పద్నాలుగేళ్ల నిద్రపోకుండా ఉండేందుకు వరాన్ని పొందాడు. ఆ నిద్రను తన భార్య అయిన ఊర్మిళకు ఇచ్చాడు. దానితో ఆమె లక్ష్మణుడు తిరిగి అయోధ్యకు వచ్చే వరకు ఆమె మేల్కోలేదు.
హనుమంతుడి గురించి ఎంత చూపిన తక్కువే అవుతుంది. రామాయణంలో ఒక మహాఘట్టానికి కారణమయ్యాడు. రామునికి మహాభక్తుడిగా కీర్తించబడ్డాడు. కానీ రాముడిలో ఉన్న గుణాలే ఆయనను ఆదర్శ మూర్తిగా నిలబెట్టాయి. రాముడు గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రం కలిగినవాడు, సకల ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించే సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు. ఇవనీ కలిస్తేనే శ్రీరామునికి పూర్తి అర్ధం అవుతుంది. జై శ్రీరామ్...!

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: