అక్షయ తృతీయ రోజున అప్పు చేసి బంగారం కొంటున్నారా...?
కానీ ఇది మంచిది కాదు. బంగారం కొనకపోయినా పర్వాలేదు కానీ అక్షయ తృతీయ నాడు అప్పు మాత్రం చేయకూడదని అది మనకు శనిగా పరిగణించబడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి అక్షయ తృతీయ నాడు బంగారం కొనదలిచేవారు తమ సొంత డబ్బులతోనే బంగారాన్ని కొనాలి. అంతే కాదు ఈ శుభ దినాన ఆ శ్రీ మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో పూజించి వ్రతాన్ని ఆచరించిన వారి జీవితం సుఖ సంతోషాలతో వెలిగిపోతుందని కోటి పుణ్యాలు చేసిన ఫలితం అందుతుందని చెబుతున్నారు పురోహితులు. అలాగే అక్షయ తృతీయ నాడు సాయం కోరి వచ్చే వారికి దానం చేయడం ద్వారా ఎంతో పుణ్యఫలం దక్కుతుందని..మనం చేసిన పాపాలు తొలిగి పోతాయని ఒక విశ్వాసం.
అంతేకాదు నేడు ఏ పని మొదలుపెట్టినా అది ఎంతో దివ్యంగా కొనసాగుతుంది. విజయాలను అందిస్తుంది. అంటే ఇంత పవిత్రమైన, మహిమాన్వితమైన ఈ రోజు ఏ పని ప్రారంభించిన విజయం సిద్ధిస్తుంది. 2021 సంవత్సరంలో అక్షయ తృతీయ వైశాఖ మాసంలోని శుక్ల పక్షం నాడు అనగా మే 14 వ తేదీ శుక్రవారం నాడు వచ్చింది. మరుసటి రోజు అనగా 15 వ తేదీ ఉదయం 7.56 గంటలకు తృతీయ తిధిలో ముగుస్తుంది. గొప్పలకు పోయి అప్పులు చేసి బంగారాన్ని కొనకండి.