శ్రీకాళహస్తీశ్వర దేవాలయ విశేషాలివే ?

VAMSI
భారతదేశంలో ఉన్న ప్రత్యేకమైన, విశిష్టమైన శివాలయాల్లో శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం కూడా ఒకటి. నిత్యం వేల మంది ప్రజలు ఇక్కడ కొలువై ఉన్న ఆ మహా శివుని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ ఆలయ ప్రత్యేకత గురించి కనుక తెలుసుకుంటే ఖచ్చితంగా దర్శించుకోవాలనే ఆలోచన మీకు కూడా వస్తుంది. అంతటి మహిమ కలిగిన శ్రీకాళహస్తిలో ఉన్న శివాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం దక్షిణ కైలాసంగా పేరు ప్రఖ్యాతులు పొందింది. పరమ పవిత్రమైన శ్రీకాళహస్తి క్షేత్రంలో గాలిగోపురం ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడ ఆలయ శిఖర దర్శనం చేసుకుంటే కైలాసాన్ని చూసినట్లే. ఈ ఆలయంలోకి అడుగుపెట్టక ముందే కైలాసగిరి ప్రదక్షిణలు కనుక చేసినట్లయితే సాక్షాత్తు ఆ పరమశివుని దర్శించుకున్న భావన మీకు కలుగుతుంది. ఎందుకంటే ఈ క్షేత్రంలో పరమశివుడు కైలాసగిరిగా వెలిశాడు అని పురాణాలు చెబుతున్నాయి.
శ్రీకాళహస్తిలోని వాయులింగం  క్షేత్రంలో  వెలసిన జ్ఞానప్రసూనాంబ అమ్మవారు ఇంద్రునికే జ్ఞానం ప్రసాదించిన దేవతగా ప్రతీతి. అంతేకాదు ఈ ఆలయంలో భక్తుల కోరికలను విని వారిని  అనుగ్రహించేందుకు ఓ వైపు తల వాల్చి ఉంది. ఇది ఎంతో ప్రత్యేకం. ఇక్కడ వాయులింగేశ్వరుడు నవగ్రహ కవచం ధరించి ఉన్నాడు. నవగ్రహాల అధినేత ఆధీనంలో ఉంచుకున్న శివుడు ఇలా నవ గ్రహాలను ధరించి ఉన్నాడని చెబుతారు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా కన్నుల పండుగగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో ఆ శివుని పరమ భక్తుడైన భక్త కన్నప్పకు మొదటి పూజలు చేయడం ఆచారంగా వస్తోంది.
ఈ పుణ్యక్షేత్రంలో పాతాళ వినాయకుడు మరో అద్భుతం. ఇక్కడ పాతాళంలో వినాయకుడు కొలువై ఉంటాడు. ఇక్కడ వినాయకుడిని దర్శించుకోవాలంటే కేవలం ఒక్కరు మాత్రమే వెళ్లగలిగే అంతటి సన్నని గుహ నుండి మాత్రమే వెళ్ళాలి. ఈ పుణ్య క్షేత్రంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాళ వినాయకుడి దర్శనం చేసుకున్న తర్వాతనే శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవడం మంచిది. ఇక్కడ ఆదిదేవుడు వినాయకుడిని మొదటగా దర్శించుకోవాలి అన్నది ఇక్కడ విశేషం. ఇలా ఎన్నో విశేషాలు ఈ పుణ్యక్షేత్రం గురించి ప్రాచుర్యంలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: