ఈ నెల అనగా జూన్ 10 వ తేది సూర్య గ్రహణం. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎవరూ ఆ రోజు బయటకు రావొద్దని పెద్దలు చెబుతున్నారు. భూమికి మరియు సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం అనేది తరచూ అమావాస్య నాడు ఏర్పడుతుంది. సూర్య గ్రహణం వస్తుందంటే చాలు పెద్ద వాళ్ళు గర్భిణీ స్త్రీలకు పలు జాగ్రత్తలు చెబుతుంటారు. ఇంటి గడప దాటి బయటకు రావద్దని హెచ్చరిస్తారు. అసలు కనీసం ఇంటిలోకి కాస్తయినా సూర్యరశ్మి పడకుండా చూసుకోవాలి అని సూచిస్తారు. ఒకవేళ సూర్య గ్రహణం నాడు గర్భిణీలు బయటికి వస్తే అరిష్టం అని పుట్టబోయే బిడ్డకు మంచిది కాదని చెబుతుంటారు.
ఇక సూర్య గ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు ఎందుకు బయటకు రాకూడదు అన్న విషయానికొస్తే సూర్య గ్రహణం సమయంలో వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు నెలకొంటాయని, సూర్య గ్రహణం సమయంలో సూర్యుని నుండి వెలువడే రేడియో ధార్మకి కిరణాలు మనిషి యొక్క శరీర అవయవాలపై ప్రభావం చూపుతాయని. ముఖ్యంగా గర్భిణీలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఎందుకంటే వారి కడుపులో పెరిగే పిండానికి సూర్యగ్రహణం నుండి వెలువడే రేడియోధార్మిక కిరణాలను తట్టుకోగల శక్తి ఉండదని తద్వారా పిండం పెరుగుదలపై ఆ ప్రభావం ఎక్కువగా పడుతుందని, కాబట్టి గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు అని చెప్పబడింది.
ఇక ఈ సారి జూన్ 10 న ఏర్పడబోయే సూర్య గ్రహణం భారతీయ కాలమానం ప్రకారం చూస్తే ఇది మధ్యాహ్నం 1.42 గంటల నుండి సాయంత్రం 6.41 గంటల వరకు అనగా సూర్యాస్తమయం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతే దాదాపు అయిదు గంటల సేపు ఈ సూర్యగ్రహణం అనేది ఉండబోతోంది అన్నమాట. కాబట్టి గర్భిణీలు ఈ సమయంలో గ్రహణం నియమాలు పాటించడం మంచిదని పెద్దలు చెబుతున్నారు. ఈ 5 గంటల పాటు గర్భవతులు ఇంటి గడప దాటి బయటకు రావడం మంచిది కాదని చెబుతున్నారు.