హిందు ధర్మ శాస్త్రంలో ఏకాదశికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏకాదశిలో పలు రకాలు ఉన్న విషయం తెలిసినదే. ఏకాదశిలో మొత్తం 24 ఏకాదశులు ఉన్నాయి. ఈ ఏకాదశులలో నిర్జల ఏకాదశికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ ఏకాదశి కనుక ఉపవాసముంటే 24 ఏకాదశులకు ఉపవాసం ఉనట్లేనని శాస్త్రాలు చెబుతున్నాయి. జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని నిర్జల ఏకాదశిగా చెప్పబడుతోంది. ఈ ఉపవాసం ఎంత అద్భుతమైన ఫలితాలను అయితే ఇస్తుందో అదే విధంగా ఈ నిర్జల ఏకాదశి ఉపవాస దీక్షను పాటించడం కూడా అంతే కఠినతరం. ముందుగా నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం చేసేవారు దీక్ష ముగిసేంత వరకు కనీసం కొద్దిపాటి నీటిని కూడా తాగరు.
అందుకే దీనికి నిర్జల ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ ఏకాదశి నాడు గణ పదార్థాలు కానీ ద్రవపదార్థాలు కానీ అసలు తీసుకోరాదు. అందుకే ఉపవాసం చేసేవారు అసలు నీళ్లు కానీ మరి పదార్థాలు కానీ తీసుకోరు. అదేవిధంగా ఎవరైతే ఈ ఉపవాస దీక్షను పూర్తి చేస్తారో వారి ఇష్ట కార్యాలు తప్పక నెరవేరుతాయని ప్రతీతి. బ్రహ్మ ముహూర్తంలో మొదలై ఈ నిధుల ఏకాదశి నాడు జన్మ జన్మలకు సరిపడా పుణ్యాన్ని అందుకోవటమే అవుతుంది. ఈ నిర్జల ఏకాదశి నాడు ప్రత్యేకమైన పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
విష్ణుమూర్తికి చేసే పూజలో ఖచ్చితంగా తులసీదళాలు వేసి విష్ణువు స్వీకరించారని హిందువుల యొక్క విశ్వాసం. అంతే కాకుండా నిర్జల ఏకాదశి నాడు చేసే పూజలో దానం అనేది చాలా ముఖ్యమైనది. పేదవారికి దానం చేయడం వలన మీరు కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. కాబట్టి మీరు కూడా నిర్జల ఏకాదశి పర్వదినాన పై విధంగా పూజించండి. ఇలా అన్ని విధాలుగా నిర్జల ఏకాదశి నాడు ఉపవాస దీక్ష చేయడం ఎంతో ఉత్తమం.