ఆ గుడిలో దొంగతనం చేస్తే సంతానం కలుగుతుందట..!
ఆ ఆలయంలో దొంగతం చేస్తే తమకు పిల్లలు పుడుతారనే నమ్మకం ఉంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే దొంగతంనం చేస్తారు. దీన్ని చూసిన వారు కూడా ఎమనరు. పైగా ఆలయ పూజారే దొంగతం చేయమని చెబుతాడట. సాధారణంగా ఆలయాల వద్ద పోలీసులు, సీసీ కెమెరాల భద్రత కట్టుదిట్టంగా ఉంటుందనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రముఖంగా ఉన్న ఆలయాల్లో భద్రత మరింత కట్టుదిట్టంగా ఉంటుంది.
సంతానం లేని వారే ఎక్కువగా ఈ చూడామణి ఆలయానికి వస్తుంటారు. తమకు ఎంతకీ పిల్లలు పుట్టకపోతే ఈ దేవాలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే చూడామణి ఆలయానికి వచ్చే వారు తప్పకుండా దొంగతనం చేయాలనే నియమం, కట్టుబాటు ఉంది. ఈ దొంగతనాన్ని అందరూ చూస్తుండగానే చేస్తారు. దొంగతనం అంటే నగలు, డబ్బులు కాదు.. అమ్మవారి పాదాల వద్ద ఉన్న ఓ చెక్క బోమ్మను సంతానం లేని దంపతులు దొంగతనం చేయాలి. ఆ చెక్క బొమ్మను దొంగతం చేసిన వారికి పండంటి బిడ్డలు పుడుతారని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు.
ఈ వింతైన ఆచారం వెనుక ఓ కథ ఉందని.. ఆనాధిగా ఈ ఆచారం కొనసాగుతూ వస్తోందని చూడామణి ఆయల పూజారులు చెబుతున్నారు. అలాగే చాలా మందికి ఈ ఆలయానికి రావడం వల్ల సంతానం కలిగిందని వారు చెబుతున్నారు.