పూజ గదిలో పొరపాటున వీటిని ఉంచుతున్నారా ?

VAMSI
హిందువులకు దేవునిపై ఎంతో ప్రగాఢ విశ్వాసం. నిత్యం పూజలు చేస్తూ దేవునిపై పరిపూర్ణమైన భక్తిని కలిగి ఉంటారు. ముఖ్యంగా పూజ గదిని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకుంటారు. పూజ మందిరంలో దేవుళ్ళ ఫోటోలను , ప్రతిమలను ఉంచి నిత్యం భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుతుంటారు. అయితే పూజ గదిలో కొన్ని రకాల వస్తువులు, ప్రతిమలు పెట్టడం ద్వారా నెగటివ్ ఎనర్జీ ఏర్పడి ఇంట్లో సుఖ శాంతులు లోపిస్తాయి. లక్ష్మి దేవి అనుగ్రహానికి నోచుకోకుండా ఆర్థికంగా నష్టపోతారని చెబుతోంది శాస్త్రం. ఇంతకీ పూజ గదిలో ఉండకూడని ఆ వస్తువులేంటో ఇపుడు చూద్దాం.

చాలా మంది దేవుడికంటూ ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసుకుంటారు. మరి కొందరు అలమారాలో పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటుంటారు. అయితే దేవుని మందిరాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. నైరుతిలో దేవుడి గదిని లేదా స్థలాన్ని ఏర్పాటు చేయుట మంచిది.  నైరుతి ఆగ్నేయం దిక్కులను దేవుని మందిరాల కొరకు అసలు వినియోగించ రాదు. అలాగే పూజా మందిరంలో  విరిగిపోయిన విగ్రహాలను అసలు ఉంచరాదు. అదేవిధంగా చిరిగి పోయిన దేవుడి పటాలను కూడా ఉంచరాదు.  శివలింగాన్ని కూడా వీలైనంత వరకు పూజ గదిలో ఉంచకపోవడమే మంచిది.


ఒకవేళ ఉంటే మాత్రం  ప్రతిరోజూ ఖచ్చితంగా లింగానికి అభిషేకం, చేయడం నైవేద్యాన్ని సమర్పించడం  తప్పక చేయాలి.   అంతే కాకుండా ఒకే దేవునికి సంబంధించినటువంటి అనేక ప్రతిమల్ని  పూజ గదిలో ఉంచరాదు. ఏదో ఒకటి ఉంటే మంచిది. పూజ గదిలో  ఆంజనేయ స్వామి ఫోటో ఉంచడం ద్వారా నర దృష్టి ఇంటిపై పడకుండా ఉంటుంది. ఇలా పూజ గదిలో పండితులు చెప్పిన విధంగా పాటిస్తే మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా శుభమే జరుగుతుంది. ఈ విషయంలో ఇంకా ఏమైనా  సందేహాలు ఉన్నట్లయితే ఎవరో ఒక పండితుడిని కలిసి  మీ సందేహాలను నివృత్తి చేసుకోకండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: